Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

KCR: ఎట్టకేలకు అసెంబ్లీకి వచ్చిన మాజీ సీఎం కేసీఆర్..!

మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కే. చంద్రశేఖర్ రావు ఎట్టకేలకు అసెంబ్లీకి హాజరయ్యారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ సభకు హాజరు కాలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయినప్పుడు కేసీఆర్ కింద పడడంతో ఆయన కాలుకు ఆపరేషన్ చేశారు. దీంతో ఆయన అందరితో పాటు ప్రమాణ స్వీకారం చేయలేదు. ఆ తర్వాత స్పీకర్ ఛాంబర్ లో ప్రత్యేకంగా ప్రమాణం చేశారు.

ఆ తర్వాత బడ్జెట్ సమావేశాలు జరిగాయి. అప్పటికీ కేసీఆర్ కోలుకున్నప్పటికీ సభకు రాలేదు. ఈ క్రమంలోనే కేసీఆర్ సభకు ఎందుకు రావటం లేదు అంటూ అధికార పార్టీ నిలదీసింది. కాంగ్రెస్ కు భయపడే కేసీఆర్ సభ కు రావడం లేదని పేర్కొంది. ముఖం చెల్లక సభకు రావడం లేదని ఎద్దేవా చేసింది. ప్రజలు కూడా కేసీఆర్ సభకు ఎందుకు వెళ్లడం లేదని చర్చించుకున్నారు. అయినప్పటికీ కేసీఆర్ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాలేదు.

Former Chief Minister KCR attended the budget meetings

తాజాగా కూడా ప్రారంభమైన సమావేశాలకు ప్రారంభంలో హాజరు కాలేదు. కేంద్రం తెలంగాణకు అన్యాయం చేయడంపై అసెంబ్లీలో బుధవారం చర్చ జరిగింది. అయితే తెలంగాణకు అన్యాయం జరిగినా చర్చించడానికి కేసీఆర్ రాలేదని.. కనీసం స్పందించలేదని కాంగ్రెస్ విమర్శించింది.
ఒత్తిడి పెరగడంతో కేసీఆర్ ఎట్టకేలకు గురువారం సభకు హాజరయ్యారు. గురువారం బడ్జెట్ ను సభలో భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు.

కేంద్ర బడ్జెట్ పై అసెంబ్లీ చర్చ సందర్భంగా కేటీఆర్ తెలంగాణకు అన్యాయం జరిగిందని.. దీనిపై కేంద్ర పోరాటం చేయాలన్నారు. ఢిల్లీకి వెళ్లి ధర్నా చేయాలన్నారు. దీనికి స్పందించిన రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, మంత్రులను ఎన్ని సార్లు కలిసిన ఫలితం లేక పోయిందని అన్నారు. తెలంగాణకు కేంద్రం అన్యాయం చేసిందన్నారు. కేంద్రంపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని.. కేసీఆర్ కూడా తమతో కలిసి రావాలని కోరారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+