కొత్తకారులో, బ్యాండ్ మేళంతో హంగామా.. రెండేళ్ళ తర్వాత కూతుర్ని స్కూల్ కి పంపిన తండ్రి !!
పిల్లలు స్కూల్ కి వెళ్ళమని మారాం చేస్తే తల్లిదండ్రులు ఏం చేస్తారు? బతిమాలో, భయపెట్టో స్కూల్ కి పంపించే ప్రయత్నం చేస్తారు. దగ్గరుండి మరీ స్కూల్ దగ్గర దించి వస్తారు. అవసరమనుకుంటే రెండు దెబ్బలు వేసి అయినా స్కూలుకు పంపించి వస్తారు. కానీ ఓ తండ్రి కూతురు స్కూల్ కి వెళ్ళనని మారాం చెయ్యకుండా ఓ ఇంట్రెస్టింగ్ ప్లాన్ చేశారు. కొత్త కార్ లో కూతుర్ని బ్యాండ్ మేళం పెట్టి మరీ ఓ ఫంక్షన్ కి పంపినట్టు కూతుర్ని స్కూల్ కి పంపారు. ఇంతకీ ఆసక్తికర సంఘటన ఎక్కడ జరిగింది అంటే

కూతుర్ని స్కూల్ కి పంపటానికి తండ్రి చేసిన వినూత్న ఆలోచన
హైదరాబాద్ జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఇంట్లో జరిగిన ఈ ఆసక్తికర సంఘటన ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. కరోనా మహమ్మారి కారణంగా రెండు సంవత్సరాలుగా స్కూలుకు వెళ్లని చిన్నారిని మళ్లీ స్కూల్ కి పంపించడం కోసం ఆయన చేసిన ప్రయత్నం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కరోనా మహమ్మారి కారణంగా మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి కుమార్తె జన శ్రీ రెడ్డి తన ఆరవ తరగతి, ఏడవ తరగతిని ఇంట్లో ఉండే చదువుకుంది. ఇప్పుడు కరోనా మహమ్మారి శాంతించడంతో తిరిగి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. బయట వ్యాపార కార్యకలాపాలు కూడా యధావిధిగా సాగుతున్నాయి. కరోనాతో మూతబడిన అన్ని తిరిగి పున ప్రారంభం కావడంతో స్కూల్ కి రావాలని స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు సూచించింది.

కొత్త కారులో బ్యాండ్ మేళం పెట్టి మరీ కూతుర్ని స్కూల్ కి పంపిన తండ్రి
ఈ క్రమంలో జన శ్రీ రెడ్డి స్కూల్ కి వెళ్లడానికి ఆసక్తి చూపించడం లేదు. స్కూల్ కు వెళ్ళాలనే ఆసక్తి కలిగించటం కోసం భిన్నమైన ఆలోచన చేసిన మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి కూతుర్ని స్కూల్ కి పంపించడం కోసం కూతురుకు ఇష్టమైన కొత్త కారు రెడీ చేశారు. ఆపై బ్యాండ్ మేళం వారిని పిలిపించి, ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్లు హడావిడి చేశారు. రెండేళ్ల తర్వాత కూతురు స్కూల్ కి వెళ్తుంది అన్న ఆనందంలో అట్టహాసమైన ఏర్పాట్లు చేసిన విష్ణువర్ధన్ రెడ్డి కుమార్తెను బాజాభజంత్రీలతో స్కూల్ కి పంపించారు.

స్కూల్ యూనిఫాం లో కూతుర్ని చూసుకుని మురిసిపోయిన తల్లిదండ్రులు
జన శ్రీ రెడ్డి చిరేక్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతోంది. రెండేళ్లు కరోనా మహమ్మారి కారణంగా ఇంట్లోనే ఉండి చదువుకున్న జన శ్రీ రెడ్డి మళ్లీ స్కూల్ యూనిఫామ్ లో ముస్తాబై స్కూల్ కి వెళ్లడం చాలా సంతోషంగా ఉందని తల్లిదండ్రులు చెబుతున్నారు. తమ కుమార్తెను మందలించి, భయపెట్టి స్కూల్ కి పంపించడం తమకు ఇష్టం లేదని, తనకు ఆసక్తి ఉండేలా, స్కూల్ కి వెళ్ళాలి అనే శ్రద్ధ చూపించేలా ఇలా బ్యాండ్ మేళం పెట్టి ఏర్పాట్లు చేశామని వారు అంటున్నారు.
Recommended Video


కూతుర్ని స్కూల్ కి పంపటం కోసం తండ్రి చేసిన పని.. ఫిదా అయిన స్థానికులు
మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఇంటి ముందు హడావుడి చూసి ఏం ఫంక్షన్ జరుగుతుందని ఆరా తీసిన ఇరుగుపొరుగు వారంతా ఈ విషయం తెలిసి అవాక్కయ్యాను. కూతురి మీద ప్రేమతో తండ్రి చేసిన ఏర్పాట్లను చూసి స్థానికులు చర్చిస్తున్నారు. మొత్తానికి మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి తన కుమార్తెను భిన్నంగా స్కూల్ కి పంపించి ప్రస్తుతం వార్తల్లో వ్యక్తి అయ్యారు. కూతురు కోసం ఆ తండ్రి చేసిన ఏర్పాట్లకు జనాలు కూడా ఫిదా అయ్యారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications