రాయపర్తిలో మాజీమంత్రి ఎర్రబెల్లి అరెస్ట్.. తీవ్ర ఉద్రిక్తత!
రాష్ట్రవ్యాప్తంగా యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్న రైతులు యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్నారు. క్యూలైన్లలో చెప్పులు పెట్టి పడిగాపులు పడుతూ యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో అయితే రాత్రివేళల్లోనే ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల వద్ద పడుకుంటున్నారు. యూరియా కోసం నానా అవస్థలు పడుతున్నారు.

రైతుల కోసం బీఆర్ఎస్ ఆందోళన
రైతులు ఇంతగా ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టింపు లేకుండా వ్యవహరిస్తుందని, రైతుల పక్షాన బి ఆర్ ఎస్ పార్టీ ఆందోళనలు మొదలు పెట్టింది. ప్రభుత్వం తక్షణం రైతులకు యూరియా అందించాలని డిమాండ్ చేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో బఫర్ స్టాక్ పెట్టి, రైతులకు ఇబ్బంది లేకుండా చేశామని, ప్రస్తుత ప్రభుత్వం రైతులకు యూరియా ఇవ్వకుండా, ఎలాంటి ముందు చూపు లేకుండా ప్రవర్తించి రైతులకు నష్టం చేస్తుందని మండిపడుతోంది.
రైతులకు మద్దతుగా రాయపర్తిలో రోడ్డుపై బైఠాయించి బీఆర్ఎస్ ధర్నా
ఈ ప్రభుత్వం రైతు సంక్షేమం అన్ని విధాల ఫెయిల్ అయిందని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. యూరియా కోసం అన్నదాతలు రోడ్డెక్కి ఆందోళనలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు వరంగల్ జిల్లా రాయపర్తిలో యూరియా కొరతకు నిరసనగా రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రధాన రహదారి పైన ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది.

ధర్నాలో మాజీమంత్రి ఎర్రబెల్లి.. ట్రాఫిక్ కి ఇబ్బంది
రైతుల ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతుల యూరియా సమస్యను తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోడ్డుపైన బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో రైతులు, బి ఆర్ ఎస్ ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. ప్రధాన రహదారి మీద బైఠాయించి ఆందోళన చేయడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు ఎర్రబెల్లి దయాకర్ రావు ను అరెస్ట్ చేశారు.

రైతులకు, పోలీసులకు మధ్య తోపులాట.. ఎర్రబెల్లి అరెస్ట్ తో ఉద్రిక్తత
ఈ క్రమంలో రైతులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఎర్రబెల్లి దయాకర్ రావును రాయపర్తి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు రైతులు తమకు యూరియా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. తమ సమస్య పరిష్కరించాలని, పంటలను కాపాడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications