భగ్గుమన్న విభేధాలు.. మంత్రి పొన్నంపై సొంత పార్టీ మాజీ ఎంపీ ఫైర్ !

తెలంగాణ కాంగ్రెస్‌లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపధ్యంలో పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. కాంగ్రెస్ అభ్యర్ధి విషయంలో ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్.. మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఫైర్ అయ్యారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

పొన్నం ప్రభాకర్ ఏమన్నారంటే..

హైదరాబాద్ ఇన్‌ఛార్జ్ మంత్రిగా వ్యవహరిస్తున్న పొన్నం ప్రభాకర్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. బయటివారికి టిక్కెట్ కల్పించకూడదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పట్ల పలువురు పార్టీ సీనియర్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.

former-mp-anjan-kumar-yadav-comments-on-minister-ponnam-prabhakar

అంజన్ కుమార్ కౌంటర్..

ఈ మేరకు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్‌.. పొన్నం వ్యాఖ్యలపై స్పందించారు. పొన్నం ప్రభాకర్ కంటే తానే సీనియర్ నాయకుడు అని గుర్తు చేశారు. అదే సమయంలో జూబ్లీహిల్స్ టిక్కెట్ ఎవరికి ఇవ్వాలనేది అధిష్టానం నిర్ణయించాలని స్పష్టం చేశారు. పొన్నం ప్రభాకర్ ప్రకటనలు, టిక్కెట్ పై అధికారాన్ని స్వయంగా చూపించే ప్రయత్నం అని ఆయన విమర్శించారు. అంతే కాకుండా ఆయన కాంగ్రెస్ లోని కుటుంబాధిపత్య విధానాలను ప్రస్తావించారు.

ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతి.. కోమటిరెడ్డి సోదరులు.. మల్లు భట్టివిక్రమార్క్, ఆయన అన్న మల్లు రవి.. వివేక్ మంత్రిగా, కుమారుడు ఎంపీగా, సోదరుడు ఎమ్మెల్యేగా ఉన్న విషయాలను ఉదాహరణలుగా చాటారు. ఈ పరిస్థితుల్లో తన కుమారుడు ఎంపీగా ఉన్నంత మాత్రాన తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఎందుకు ఇవ్వకూడదు?" అని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ పార్టీని బలోపేతం చేయడానికి మహమూద్ అలీకి ఎమ్మెల్సీ పదవితో పాటు ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి పదవులు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే నాయిని నర్సింహారెడ్డికి కూడా ఎమ్మెల్సీ పదవితో హోంమంత్రి పొందారన్నారు.

ఈయక పార్టీ అధిష్టానం త్వరలోనే అభ్యర్ధిపై తుది నిర్ణయం తీసుకోనుందని సమాచారం. అయితే జూబ్లీహిల్స్ టికెట్ రేసులో ప్రధానంగా అంజన్ కుమార్ యాదవ్ తో పాటు.. నవీన్ యాదవ్, కార్పొరేటర్ సీఎన్ రెడ్డి ఉన్నారు. మాజీ మంత్రి కంజర్ల లక్ష్మీనారాయణ కోడలు అయిన కంజర్ల విజయలక్ష్మి కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మహిళా అభ్యర్థికి టికెట్ ఇవ్వడంతో.. కాంగ్రెస్ కూడా మహిళా అభ్యర్థికే అవకాశం ఇవ్వాలని ఆమె కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+