KCR: కేసీఆర్ ఆపరేషన్ సక్సెస్-హెల్త్ బులిటెన్ విడుదల-విశ్రాంతి అవసరమన్న డాక్టర్లు..

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇవాళ నిర్వహించిన తుంటి మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైంది. దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించి డాక్టర్లు ఈ ఆపరేషన్ ను సక్సెస్ చేశారు. ఇవాళ తెల్లవారుజామున ఇంట్లో కాలు జారి పడటంతో గాయపడ్డ కేసీఆర్ ను యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మధ్యాహ్నానికి డాక్టర్లు శస్త్రచికిత్స అవసరమని తేల్చారు. అనంతరం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో డాక్టర్లు కేసీఆర్ కు ఆపరేషన్ ప్రారంభించారు.

former telangana cm kcrs hip replacement surgery successful, doctors say recover in 6-8 weeks

కేసీఆర్ కు ఇవాళ మధ్యాహ్నం నిర్వహించిన తుంటి మార్పిడి శస్త్రచికిత్సపై యశోద ఆస్పత్రి డాక్టర్లు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఇందులో ఆయనకు నిర్వహించిన సర్జరీ విజయవంతం అయినట్లు డాక్టర్లు వెల్లడించారు. కేసీఆర్ ఎడమ తుంటికి నిర్వహించిన ఈ శస్త్రచికిత్సకు ఆయన శరీరం బాగానే సహకరించిందని వారు తెలిపారు. ఆస్పత్రిలోని సీనియర్ ఆర్ధోపెడిక్ సర్జన్లు, అనస్తీషియాలజిస్టులు, నర్సులతో కూడిన బృందం ఆయనకు ఈ సర్జరీ నిర్వహించినట్లు వారు తెలిపారు.

former telangana cm kcrs hip replacement surgery successful, doctors say recover in 6-8 weeks

సర్జరీ విజయవంతం కావడంతో కేసీఆర్ ను ఆపరేషన్ థియేటర్ నుంచి సాధారణ రూమ్ కు మార్చినట్లు డాక్టర్లు హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన సర్జరీ నుంచి కోలుకుంటున్నట్లు వెల్లడించారు. సర్జరీ తర్వాత ఇచ్చే ఐవీ ఫ్లూయిడ్స్, యాంటీబయాటిక్స్, ఇతర మందులు ఆయనకు ఇస్తున్నట్లు వారు తెలిపారు. రేపు ఆయన ఆరోగ్య పరిస్ధితిని బట్టి ఆంబులేషన్, ఫిజియోథెరపీతో పాటు న్యూట్రిషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని డాక్టర్లు వెల్లడించారు.

మరోవైపు ఇవాళ సర్జరీ పూర్తి చేసుకున్న కేసీఆర్ సాధారణంగా పూర్తిగా కోలుకునేందుకు మరో 6 నుంచి 8 వారాలు పడుతుందని అంచనా వేసినట్లు డాక్టర్లు వెల్లడించారు. అయితే ఈ ఆరు నుంచి ఎనిమిది వారాలు ఆయన ఆస్పత్రిలోనే ఉండాలా లేక మధ్యలో డిశ్చార్జ్ చేసి పంపిస్తారా అన్నది మాత్రం డాక్టర్లు హెల్త్ బులిటన్ లో వెల్లడించలేదు. రేపు ఆయన్ను పరీక్షించాక ఈ వివరాలు అందించే అవకాశముంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+