LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల!

తెలంగాణ విద్యావ్యవస్థలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. అట్టడుగు వర్గాల పిల్లలకు కూడా కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం 'ప్రీ-ప్రైమరీ' (పూర్వ ప్రాథమిక) విద్యపై భారీ అడుగులు వేస్తోంది. ప్రైవేటు స్కూళ్లకు వెళ్లలేని పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఎల్‌కేజీ, యూకేజీ తరగతులను అందుబాటులోకి తెస్తూ విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది.

వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుంచి రాష్ట్రవ్యాప్తంగా అదనంగా 3,000 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విద్యను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 1,000 పాఠశాలల్లో విజయవంతంగా నడుస్తున్న ఈ విధానాన్ని ఇప్పుడు మరింత విస్తరిస్తున్నారు. బడ్జెట్‌లో ప్రకటించిన దానికంటే మిన్నగా, సుమారు 3,000 స్కూళ్లలో యూకేజీ తరగతులను ప్రారంభించేందుకు విద్యాశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. త్వరలోనే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ల (DEO) నుంచి అందిన నివేదికల ఆధారంగా ఈ పాఠశాలల జాబితాను ఖరారు చేయనున్నారు.

Free UKG in Govt Schools Telangana to Expand Pre-Primary Education to 3 000 New Schools Next Year

ప్రతి పంచాయతీకి ఒక 'ప్రీ-ప్రైమరీ' స్కూల్..

రాష్ట్రంలోని 12,700 గ్రామ పంచాయతీల్లో ప్రతి పంచాయతీకి కనీసం ఒక పాఠశాలనైనా ప్రీ-ప్రైమరీ కేంద్రంగా మార్చాలన్నది ప్రభుత్వ బృహత్తర లక్ష్యం. ప్రస్తుతం 1,362 పాఠశాలల్లో ఈ విధానం అమలులో ఉండగా, వీటిలో చిన్నారుల సంరక్షణ కోసం ఆయాను, విద్యాబోధన కోసం ప్రత్యేక ఇన్‌స్ట్రక్టర్‌ను నియమించారు. సమగ్ర శిక్షా ప్రాజెక్టు నిధులతో వీరికి గౌరవ వేతనాలు (ఆయాకు ₹6,000, ఇన్‌స్ట్రక్టర్‌కు ₹8,000) అందజేస్తున్నారు. తాజా నిర్ణయంతో మరో 6,000 మందికి ఉపాధి లభించనుండటం విశేషం.

హైదరాబాద్ 'క్యూర్‌' ప్రాంతాల్లోనూ విస్తరణ..

నగర ప్రాంత విద్యార్థుల కోసం హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) పరిధిలో కూడా ఈ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపల ఎంపిక చేసిన 28 ప్రాంతాల్లో ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే చోట విద్యనందించేలా ప్రభుత్వం ఇప్పటికే జీఓ జారీ చేసింది. ప్రైవేటు పాఠశాలల్లో మాదిరిగానే ప్రభుత్వ బడుల్లోనూ నర్సరీ, ఎల్‌కేజీలను కూడా ప్రవేశపెట్టాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+