ఫ్రెండే: లాడ్జికి తీసికెళ్లి రేప్ చేసి ఇంటి వద్ద దింపేశాడు
హైదరాబాద్: తన స్నేహితురాలి పట్ల ఓ యువకుడు నీచంగా ప్రవర్తించాడు. హైదరాబాదులోని పాతబస్తీలో గల కాలాపత్తర్‌లో ఓ యువకుడు 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. ఇంటికి తిరిగి వస్తున్న బాలికను నిందితుడు తన వెంట బైక్‌పై లాడ్జికి తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు.
బిలాల్‌నగర్‌కు చెందిన బాధితురాలు తొమ్మిదో తరగతి చదువుతున్నట్లు కాలాపత్తర్ పోలీసులు తెలిపారు. ఆమెకు దాదాపు నెల రోజుల క్రితం ఇమ్రాన్ అనే యువకుడితో స్నేహం ఏర్పడింది. పొరుగునే ఉండే అతను బాలికకు ఓ ఫోన్ కొనిచ్చాడు. దీంతో ఇరువురు గంటల తరబడి ఫోన్‌లో మాట్లాడుకునేవారు.

గురువారం సాయంత్రం ఇంటికి తిరిగి వస్తున్న బాలికను ఇలియాస్ అహ్మద్ తన బైకుపై తీసుకుని వెళ్లాడు. రాత్రికి ఇంటికి వచ్చిన బాలిక కడుపు నొప్పి వస్తుందని చెప్పింది. దాంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకుని వెళ్లగా, ఆ బాలికపై రేప్ జరిగినట్లు పరీక్షల్లో తేలింది.
ఇలియాస్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనలో ఇమ్రాన్ పాత్రపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తనను తీసుకుని వెళ్లి లాడ్జి పేరు గానీ అదెక్కడుందనే విషయాన్ని గానీ బాధితురాలు చెప్పలేకపోతున్నట్లు పోలీసులు తెలిపారు. తనపై దాడి చేసిన వ్యక్తి పేరు మాత్రమే చెప్పగలుగుతోంది.












Click it and Unblock the Notifications