Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యువతకు గుడ్ న్యూస్:సీఎం రేవంత్ కృషి‌తో హైదరాబాద్‌కు ఆ దిగ్గజ సంస్థ..!

తెలంగాణకు పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తోన్న సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం రోజున ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించారు. కాలిఫోర్నియాలో ఉన్న క్యూపర్టినోలోని యాపిల్ పార్క్‌లో ఈ సంస్థ హెడ్ క్వార్టర్స్ ఉంది. ఈ సందర్భంగా యాపిల్ అధికారులను కలిసి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా సీఎం కోరారు. తాము ఇన్వెస్ట్ చేస్తే అన్ని అనుమతులు సకాలంలో ఇస్తామని ఈ సందర్భంగా రేవంత్ చెప్పారు.

175 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న యాపిల్ సంస్థకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం సరైన రాష్ట్రంగా పేర్కొన్నారు. ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఇక్కడ మంచి వాతావరణం ఉందని యాపిల్ సిబ్బందికి తెలిపారు. అంతేకాదు కొత్త ఎలక్ట్రానిక్స్ పార్క్, స్కిల్ యూనివర్శిటీ, ఏఐ సిటీ, ఫ్యూచర్ సిటీ స్థాపనకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్‌గా మారబోతోందని సీఎం రేవంత్ నొక్కి చెప్పారు. తెలంగాణలో సాంకేతిక పురోగతితో పాటు ఆర్థిక వృద్ధిని కూడా పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.

From Hyderabad to Cupertino CM Revanth Pitches Telangana to Apple Amgen to start operation soon

మానుఫాక్చరింగ్, పబ్లిక్ పాలసీ, హెల్త్ కేర్ రంగాల్లో యాపిల్ సంస్థ ఏ రకమైన ఆసక్తి కలిగి ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసింది రేవంత్ బృందం. యాపిల్ సంస్థ ఈ రంగాల్లో ఇన్వెస్ట్ చేద్దామని ముందుకు వస్తే ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని తెలిపారు. యాపిల్ సంస్థతో జరిపిన చర్చలు తప్పక ఫలితాలిస్తాయని రేవంత్ బృందం విశ్వాసం వ్యక్తం చేసింది.ఇటు హైదరాబాద్ అటు తెలంగాణ రెండింటికీ ప్రయోజనం చేకూరుస్తుందని సీఎం రేవంత్ ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలంగాణకు బయోటెక్ సంస్థ

ప్రపంచంలోనే అతిపెద్ద బయోటెక్ సంస్థ యాంజెన్ హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.భారత్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించాలని టెక్ సంస్థ యాంజెన్ (Amgen)యోచిస్తోందని.. ఇందుకు హైదరాబాద్‌ను సెలెక్ట్ చేసుకుందని ట్వీట్‌లో వెల్లడించింది. దాదాపుగా 3వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచన వేస్తోంది. ఈ సంస్థ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, లైఫ్ సైన్సెస్‌లో ఉద్యోగాలు కల్పించనుంది. ఈ ఏడాది చివరిలోగ హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.

ఇన్నోవేషన్ టెక్నాలజీలో యంజెన్ ఇండియా కొత్త ఒరవడిని సృష్టించేందుకు సిద్ధంగా ఉన్న ప్రపంచపు అతిపెద్ద బయోటెక్ కంపెనీకి హైదరాబాద్‌కు స్వాగతం పలుకుతున్నట్లు సీఎం రేవంత్ చెప్పారు. ఈ సంస్థ రాకతో హైదరాబాద్ సిటీ ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నట్లు సీఎం రేవంత్ అన్నారు. ప్రపంచంలో లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టం‌కు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోందని ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.

మొత్తానికి తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చేందుకు రేవంత్ అండ్ టీమ్ కృషి చేస్తోంది. అమెరికాలో ఈ బృందం వివిధ సంస్థలతో జరుపుతున్న చర్చలు మంచి ఫలితాలను రాబడుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణకు విదేశీ కంపెనీలు వస్తే ఇక్కడి యువతకు మంచి ఉపాధి లభించడమే కాకుండా అభివృద్ధిలో కూడా ఇతర రాష్ట్రాలతో పోటీపడుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+