Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త.. ఈ నెల 28 నుంచి ప్రారంభం..!

తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం ద్వారా చాలా మందికి ముఖ్యంగా వాహనదారులకు ఊరట లభిస్తుందని చెప్పవచ్చు. ఇంతకీ ఏంటా కార్యక్రమం అంటే హైదరాబాద్ నగరంలో నిత్యం ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొచ్చింది.

హైదరాబాద్ నగరం మెట్రో పాలిటన్ సిటీ కావడంతో నిత్యం వేల మంది ప్రజలతో రోడ్లు నిండిపోయి ఉంటాయి. అలాగే ట్రాఫిక్ సమస్యతో స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రద్దీ ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు నిర్మించినా రోజురోజుకీ పెరిగిపోతున్న జనాభా, వాహనాల రద్దీ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

భారత్ లోనే ఐటీ రంగంలో హైదరాబాద్ టాప్ ప్లేస్ లో ఉంది. ముఖ్యంగా ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ సమస్య తీవ్రతరం అవుతోంది. ఈ క్రమంలో గచ్చిబౌలి- కొండాపూర్ మధ్య నిర్మించిన ఫ్లై ఓవర్ ప్రారంభానికి సిద్ధం అయింది. ఈ ఫ్లై ఓవర్ ను జూన్ 28న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ ఫ్లై ఓవర్ కు దివంగత కాంగ్రెస్ నేత పి. జనార్ధన్ రెడ్డి పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.

Gachibowli-Kondapur Flyover Set for Inauguration by CM Revanth Reddy on June 28

ఇక ఈ ఫ్లై ఓవర్ విశేషాలకు వస్తే.. 1.2 కిలోమీటర్ల పొడవుతో , 6 లేన్లతో విస్తరించి ఉంది. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణానికి దాదాపు రూ. 178 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం. ఈ ఫ్లై ఓవర్ శిల్ప లేఅవుట్ ఫేజ్-1 నుంచి గచ్చిబౌలి జంక్షన్ ఫ్లై ఓవర్ లకు అనుసంధానంగా పనిచేస్తుంది. ఈ ఫ్లై ఓవర్ ప్రారంభంతో ఐటీ ఉద్యోగులు ఊపిరి పీల్చుకోనున్నారు. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే గచ్చిబౌలి జంక్షన్ వద్ద ఏర్పడే ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని, ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని, దీనివల్ల ప్రయాణికులకు సమయం ఆదా అవుతుందని అధికారులు భావిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+