Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నాగ చైతన్య - రష్మిక కు అవార్డులు, దుమ్మురేపిన రాజు వెడ్స్ రాంబాయి

తెలంగాణ సినిమా రంగంలో సరికొత్త శకానికి నాంది పలుకుతూ, 2025 ఏడాదికి గాను ప్రతిష్టాత్మక 'గద్దర్ పురస్కారాల'ను రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఘనంగా ప్రకటించింది. ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ అవార్డుల జాబితాలో సినీ దిగ్గజాలకు అరుదైన గౌరవం దక్కింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవిని అత్యున్నత 'ఎన్టీఆర్ జాతీయ పురస్కారం'తో ప్రభుత్వం సత్కరించనుంది. ఈ పురస్కారాల ప్రకటనతో టాలీవుడ్‌లో పండుగ వాతావరణం నెలకొంది.

Gaddar Awards: సినీ దిగ్గజాలకు అరుదైన గౌరవం

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చిరంజీవి అందించిన అసమాన సేవలను గుర్తిస్తూ ఆయనకు ఎన్టీఆర్ జాతీయ అవార్డును కేటాయించగా, మరోవైపు విశ్వనటుడు కమల్ హాసన్‌కు 'పైడి జయరాజ్' అవార్డును ప్రకటించారు. అలాగే, తెలుగు సాహిత్యాన్ని తన కలంతో సుసంపన్నం చేసిన ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు 'సినారె (సి.నారాయణ రెడ్డి)' పురస్కారాన్ని అందజేయనున్నారు. ఆర్ నారాయణ మూర్తికి కాంతారావు అవార్డు, సింగితం శ్రీనివాసరావుకు బీఎన్ రెడ్డి అవార్డు, జయసుధకు ANR అవార్డు ప్రకటించారు.

ఈ అవార్డులకు సంబంధించిన స్పెషల్ జ్యూరీ వివరాలను ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అధికారికంగా వెల్లడించారు.

Gaddar Awards 2025 Chiranjeevi to Get NTR National Award Kamal Haasan Wins Paidi Jairaj Puraskaram Now
  • ఉత్తమ నటుడు - నాగ చైతన్య (తండేల్‌)
  • ఉత్తమ నటి - రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్‌)
  • ఉత్తమ చిత్రం - రాజు వెడ్స్ రాంబాయి
  • ఉత్తమ ద్వితీయ చిత్రం - దండోరా
  • ఉత్తమ తృతీయ చిత్రం - ది ప్రీ వెడ్డింగ్‌ షో
  • నేషనల్‌ ఇంటిగ్రిటీ సినిమా - తండేల్‌
  • ఉత్తమ పర్యావరణ చిత్రం - ఇగ్వా
  • ఉత్తమ డెబ్యూ ఫీచర్‌ ఫిల్మ్ - లిటిల్‌ హార్డ్స్
  • ఉత్తమ వినోదాత్మక చిత్రం - సంక్రాంతికి వస్తున్నాం
  • ఉత్తమ సోషల్‌ మెసేజ్‌ చిత్రం - కోర్టు
  • ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్ మూవీ - మిరాయ్‌
  • ఉత్తమ బాలల చిత్రం - అనగనగనా
  • ఉత్తమ దర్శకుడు - సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)
  • ఉత్తమ సపోర్టింగ్‌ నటుడు - శివాజీ
  • ఉత్తమ సపోర్టింగ్‌ నటి- భూమిక
  • ఉత్తమ సంగీత దర్శకుడు - మార్క్ కె రాబిన్‌ (దండోరా)
  • ఉత్తమ నేపథ్య గాయకుడు - అనురాగ్‌ (రాజు వెడ్స్ రాంబాయి)
  • ఉత్తమ నేపథ్య గాయని - సాహితి చాగంటి (కన్నప్ప)
  • ఉత్తమ హాస్యనటుడు - కృష్ణ తేజ (జిగ్రీస్‌)
  • ఉత్తమ బాలనటుడు - రోహన్ ‌ రాయ్‌ (ప్రీ వెడ్డింగ్‌ షో)
  • ఉత్తమ కథా రచయిత - గుణశేఖర్‌ (యుఫోరియా)
  • ఉత్తమ స్క్రీన్‌ ప్లే రైటర్‌ - అనిల్‌ రావిపూడి
  • ఉత్తమ గేయ రచయిత - నందకిశోర్‌ (కుబేర)
  • ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ - కార్తిక్‌ ఘట్టమనేని (మిరాయ్‌)
  • ఉత్తమ ఎడిటర్‌- శ్రీకర్‌ ప్రసాద్‌ (మిరాయ్‌)
  • ఉత్తమ ఆడియోగ్రాఫర్‌ - ఎం.ఆర్‌ రాధాకృష్ణన్‌ కిష్కిందపురి
  • ఉత్తమ కొరియోగ్రాఫర్‌ - గిర గిర గిర (ఛాంపియన్‌)
  • ఉత్తమ ఆర్ట్ డైరక్టర్‌ - తోట తరణి ఛాంపియన్‌
  • ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్ - గోవింద్‌ అఖండ
  • ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ - చాంపియన్‌ - చంద్రకాంత్‌
  • ఉత్తమ స్పెషల్‌ జ్యూరీ ఫిల్మ్ - 23
  • ఉత్తమ మేల్‌ యాక్టర్‌ - చైతూ జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి)
  • ఉత్తమ నటి - అనంతిక (8 వసంతాలు)
  • స్పెషల్‌ జ్యూరీ హీరో - రోషన్‌ (చాంపియన్‌)

ఉగాది పర్వదినాన పురస్కారాల ప్రదానం

2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెన్సార్ బోర్డు (CBFC) ధ్రువీకరణ పొందిన చలన చిత్రాలు, షార్ట్ ఫిల్మ్‌లను ఈ అవార్డుల కోసం పరిగణనలోకి తీసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక వేడుకను మార్చి 19న ఉగాది పర్వదినం సందర్భంగా నిర్వహించనున్నారు. తెలుగు సంవత్సరాది రోజున సినీ ప్రముఖులను గౌరవించుకోవడం ద్వారా ఈ వేడుకకు మరింత విశిష్టత చేకూరనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+