డిగ్రీ విద్యార్థినిపై అత్యాచార నిందితులు ముగ్గురి అరెస్ట్, రిమాండ్
ఖమ్మంలో డిగ్రీ సెకండియర్ విద్యార్థినిపై లైంగిక దాడి చేసిన ఆమె క్లాస్ మేట్స్ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఖమ్మం: ఖమ్మంలో డిగ్రీ సెకండియర్ విద్యార్థినిపై లైంగిక దాడి చేసిన ఆమె క్లాస్ మేట్స్ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని శుక్రవారం కోర్టుకు హాజరుపరిచారు. వారిని 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీని కోర్టు విధించింది.
పోలీసులు కోర్టుకు, అక్కడి నుంచి జైలుకు తరలించేటప్పుడు.. నిందితులు తమ మొహాలు కనిపించకుండా దాచుకున్నారు.

చార్జిషీటులోని వివరాలు....
ఖమ్మంలోని ప్రయివేటు డిగ్రీ కళాశాల విద్యార్థిని రోజులాగానే ఈ నెల 1న కళాశాలకు బయలుదేరింది. మార్గమధ్యలో ఆమె ప్రేమికుడైన అఖిల్ కలిశాడు. తన స్నేహితుడి బర్త్ డే పార్టీకి రావాలని కోరాడు. ఆమె ఒప్పుకోలేదు.
Recommended Video

కొంచెం దూరం వెళ్లిన తరువాత అఖిల్ స్నేహితులైన రాధాక్రిష్ణ, ఉదయ్ కలిసి ఆమెను బలవంతంగా బైక్ పై ఎక్కించుకుని పొట్టి శ్రీరాములు రోడ్డులోని ఉదయ్ గదికి తీసుకెళ్లారు. కొద్దిసేపటి తరువాత ఉదయ్ బయటకు వెళ్లాడు.

గదిలో రాధాక్రిష్ణ, ఆ విద్యార్థిని మాత్రమే ఉన్నారు. రాధాక్రిష్ణ గది తలుపులు మూసివేసి, ఆమె నోటిలో చున్నీ కుక్కి లైంగిక దాడి చేశాడు. ఆ తరువాత బయటి నుంచి వచ్చిన అఖిల్, కార్తీక్ కూడా ఆమెను బెదిరించి లైంగిక దాడి చేశారు.
దీనిని అఖిల్‌కు చెందిన సెల్ ఫోనుతో కార్తీక్ వీడియో తీశాడు. దానిని యూట్యూబ్ లో పెడతామని బెదిరించారు. ఆ తరువాత వారంతా కలిసి ఆమెను కొట్టి బయటకు గెంటేశారు.
అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఆమె తన ఇంటికి వెళ్లింది. ఒంట్లో బాగా లేకపోవడంతో వచ్చేశానని తల్లితో చెప్పింది. ఆ తల్లికి అనుమానం వచ్చింది. గట్టిగా నిలదీసింది. అయినా ఆమె ఏమీ చెప్పలేదు.
మూడో రోజున, ఈ నెల 3వ తేదీన తన తల్లికి జరిగినదంతా చెప్పింది. తల్లి సహాయంతో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు (క్రైం నంబర్ 137/2017) కిడ్నాప్, గ్యాంగ్ రేప్, బాలికను బలాత్కరించడం సెక్షన్ల కింద ఆ నలుగురిపై కేసు నమోదు చేశారు. అఖిల్ పరారీలో ఉన్నాడు.

చార్జిషీటులో ఏమున్నదంటే....
ఎ1: మల్లెల రాధాక్రిష్ణ, ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామం.
ఎ3: బిర్రు కార్తీక్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చిట్టిరామవరం.
ఎ4: బోడా ఉదయ్ కిరణ్. ఖమ్మంలోని జలగం నగర్.
ఎ2: అఖిల్. ఖమ్మంలోని మసీద్ రోడ్డు.
వీరిపై 363 (కిడ్నాప్), 376డి (సామూహిక లైంగిక దాడి), 354ఎ (లైంగిక దాడి), సెక్షన్ 6 ఆఫ్ ఫోక్సో యాక్ట్ (బాలికపై లైంగిక దాడి), సెక్షన్ 3(2) ఆఫ్ ఎస్సీ, ఎస్టీ పీవో యాక్ట్ (షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన వారిపై లైంగిక దాడి), సెక్షన్ 66(ఇ) (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్) కింద కేసులు నమోదయ్యాయి.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications