వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పడిన తెరాస వికెట్: నయీంతో లింక్‌లకు తెరాస నేత అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్యాంగస్టర్ నయీంతో సంబంధాలు నెరిపిన రాజకీయ నేతలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు పెట్టిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడొకరు అరెస్టయ్యారు. మహబూబ్‌ననగర్ జిల్లాకు చెందిన తెరాస నాయకుడిని సిట్ అధికారులు అరెస్టు చేశారు.

అరెస్టయిన బల్లె ఈశ్వరయ్య మహబూబ్‌నగర్ జిల్లా వెల్దండ మండలం తెరాస అధ్యక్షుడు. ఆయన నయీంకు అత్యంత సన్నిహితుడని, మహబూబ్ ‌నగర్ జిల్లాకు చెందిన నయీం వ్యవహారాలను అతనే చక్కబెట్టేవాడని చెబుతున్నారు

Nayeem

నయీం చేసిన అక్రమ భూకబ్జాల్లోనూ బలవంతం వసూళ్లలోనూ అతను పాలు పంచుకుంటన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈశ్వరయ్యను సిట్ అధికారులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.

నయీంతో సంబంధాలున్న రాజకీయ నేతలపై సిట్ ప్రత్యేక దృష్టి సారించినట్లు, వారికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధపడినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నయీంతో సంబంధాలు పెట్టుకున్న నేతలపై సిట్ పక్కా సాక్ష్యాధారాలు సేకరించినట్లు చెబుతున్నారు,

English summary
A TRS leader from Mahbubnagar district was arrested for alleged links with gangster Nayeem. The leader, Balle Eswaraiah, is the TRS president in Veldanda mandal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X