ఈ నెల 28 నుంచి రూ. 500 కే గ్యాస్ సిలిండర్..ఎక్క‌డో తెలుసా..?

తెలంగాణ‌లో కొత్త‌గా ఏర్ప‌డిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం మహాలక్ష్మి పథకం కింద వివిధ కార్య‌క్ర‌మాల‌ను మ‌హిళ‌ల‌కు ప్ర‌వేశ‌పెట్టింది. ఈ ప‌థ‌కంలో భాగంగానే గ్యాస్‌‌ సిలిండర్ ను రూ.500కే అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మ‌రం చేసింది. అయితే, ఈ ప్ర‌క్రియ‌ను డిసెంబ‌ర్ 28 నుంచి ప్రారంభించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నెల 28కి ఓ ప్ర‌త్యేక‌త ఉంది.

ఆ రోజు కాంగ్రెస్‌‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. అందుకే అదే రోజు నుంచి దీన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్ర‌భుత్వం యోచిస్తోంది. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగానే సివిల్‌‌ సప్లయ్ డిపార్ట్‌‌మెంట్‌‌ అధికారులు గైడ్ లైన్స్ ప‌నులను కూడా మొద‌లుపెట్టేశారు. విన‌యోగ‌దారులు ఎంత‌మంది ఉన్నారు. ఎవ‌రెవ‌రికి ఈ ప‌థ‌కం వ‌ర్తింప జేస్తుంది. దీని వ‌ల్ల రాష్ట్ర ప్రభుత్వంపై పడే భారం ఎంత..అనే లెక్క‌ల‌ను కూడా అధికారులు తీసున్నార‌నే స‌మాచారం.

Gas Cylinder for Rs 500 in Telangana will start from 28th of December

అయితే, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఒక కోటి 20 లక్షల గ్యాస్‌‌ కనెక్షన్లు ఉన్నాయని, నెలకు 60 లక్షల సిలిండర్లు సరఫరా అవుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇక‌, గ్యాస్ సిలిండ‌ర్ల‌కు సంబంధించి మహాలక్ష్మి పథకం అమలుకు ఏడాదికి దాదాపు రూ. 3 వేల కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడే అవకాశం ఉన్నట్లు స‌మాచారం. అయితే, ఈ ప‌థకాన్ని కుటుంబ యూనిట్‌గా తీసుకోవాలా లేక‌, కేవ‌లం మ‌హిళ‌ల పేరుతో ఉన్న క‌నెక్ష‌న్ల‌కే స‌బ్సిడీ ఇవ్వాలా.. అనే దానిపై చ‌ర్చ జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. ఒక్క మ‌హిళ పేరుపై ఉన్న గ్యాస్ క‌నెక్ష‌న్లనే లెక్క‌లోకి తీసుకుంటే మాత్రం కేవ‌లం 70 ల‌క్ష‌ల గ్యాస్ క‌నెక్ష‌న్లు ఉన్న‌ట్లు స‌మాచారం.

సివిల్ సప్లయ్స్ ఆఫీసర్లు బిజి...

ఇక రాష్ట్ర స‌ర్కారు ఆదేశాల ప్ర‌కారం 'రూ. 500కే సిలిండర్' స్కీమ్ కు గైడ్ లైన్స్ రూపొందించే పనిలో సివిల్ సప్లయ్స్ ఆఫీసర్లు బిజి బిజిగా ఉన్నారు. ఒక వేళ రాష్ట్ర ప్ర‌భుత్వం కేవ‌లం మహిళలకు మాత్ర‌మే ఇవ్వాలని మార్గదర్శాలు ఇస్తే గ్యాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కనెక్షన్లలో 'నేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌' అనే ప్రొవిజన్‌‌‌‌‌‌‌‌‌‌ ఉండ‌నే ఉంది. ఇక‌, మిగతా కనెక్షన్లన్నీ మహిళల పేరుపై మార్చుకోవడానికి ఎల్పీజీ డీలర్ల వద్ద వినియోగ‌దారులు క్యూ కట్టే పరిస్థితి లేక‌పోలేదు. మహిళల పేరుమీదున్న కనెక్షన్లకే రూ. 500కు సిలిండర్ అని ఒక వేళ రాష్ట్ర స‌ర్కారు మార్గదర్శకాలు రూపొందించినా, మిగతావాళ్లు కూడా 'నేమ్ చేంజ్' ఆప్షన్ ను ఉపయోగించ‌కోవ‌చ్చ‌నే వాద‌న ఒక‌టి వినిపిస్తున్న‌ది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+