GHMC లో విలీనం కానున్న 27 మున్సిపాలిటీలు ఇవే..
హైదరాబాద్ రూపురేఖలు మారిపోనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలపై మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో అవుటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 27 మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీ పరిధిలోకి రానున్నాయి. ఇందులో విలీనం కానున్నాయి. దీంతో 20 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వస్తాయి. విలీనం తర్వాత విస్తరించిన జీహెచ్‌ఎంసీని నాలుగు లేదా అయిదు ప్రధాన కార్పొరేషన్లుగా విభజించవచ్చు.
ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ దాదాపు 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. శివార్లలోని మున్సిపాలిటీల విలీనం అనంతరం దీని పరిధి 2,000 చదరపు కిలోమీటర్లకు విస్తరిస్తుంది. ఫలితంగా ఆయా ప్రాంతాలు కూడా కోర్ సిటీతో సమానంగా అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. కాగా ప్రస్తుత జీహెచ్‌ఎంసీ పదవీకాలం ఫిబ్రవరి 10వ తేదీతో ముగియనుంది. ఈలోగా విలీన ప్రక్రియ పూర్తవుతుంది. దీని తర్వాతే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.

విలీనం కానున్న మున్సిపాలిటీలు ఇవే..
1. పెద్ద అంబర్‌పేట్
2. జల్‌పల్లి
3. శంషాబాద్
4. తుర్కయంజాల్
5. మణికొండ
6. నార్సింగి
7. ఆదిభట్ల
8. మేడ్చల్
9. నాగారం
10. దమ్మాయిగూడ
11. పోచారం
12. ఘట్‌కేసర్
13. గుండ్ల పోచంపల్లి
14. తూంకుంట
15. తుక్కుగూడ
16. కొంపల్లి
17. దుండిగల్
18. బొల్లారం
19. తెల్లాపూర్
20. అమీన్‌పూర్
21. బడంగ్‌పేట్
22. బండ్లగూడ జాగీర్
23. మీర్‌పేట
24. బోడుప్పల్
25. నిజాంపేట్
26. ఫిర్జాదిగూడ
27. జవహర్‌నగర్












Click it and Unblock the Notifications