జగన్ లోటస్ పాండ్ లో కూల్చివేతలు - ఆట మొదలు..!!
ఏపీలో జగన్ ఓటమి పాలయ్యారు. తిరిగి అధికారం ఖాయం అని భావించిన జగన్ కు భారీ పరాజయం మిగిలింది. కేవలం 11 స్థానాలకే జగన్ పార్టీ పరిమితం అయింది. ఓటమి తరువాత వరుసగా పార్టీ నేతలతో జగన్ సమీక్షలు చేస్తున్నారు. భవిష్యత్ పైన భరోసా కల్పిస్తున్నారు. ఈ సమయంలోనే హైదరాబాద్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ నివాసం లోటస్ పాండ్ ప్రాంగణంలో ఆక్రమణలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేయటం సంచలనంగా మారుతోంది.
మాజీ ముఖ్యమంత్రి జగన్ హైదరాబాద్ నివాసం లోటస్ పాండ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జగన్ ముఖ్యమంత్రి కాకముందు హైదరాబాద్ లో ఇదే ప్రాంగణంలో నివాసం ఉండేవారు. అక్కడే పార్టీ వ్యవహారాలు పర్యవేక్షించారు. 2019 ఎన్నికల ముందు తాడేపల్లిలో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకొని అక్కడే ఉంటున్నారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో షర్మిల, విజయమ్మ..కుటుంబ సభ్యులు కొనసాగుతున్నారు. ఈ మధ్య కాలంలోనే జగన్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించేందుక వెళ్లిన సమయంలో చివరి సారిగా లోటస్ పాండ్ కు వెళ్లారు.

అక్కడ తల్లి విజయమ్మతో సమావేశం అయ్యారు. ఇక, ఇప్పుడు లోటస్ పాండ్ లో అక్రమ నిర్మాణాలను జీహెచ్‍ఎంసీ సిబ్బంది కూల్చివేత మొదలు పెట్టారు. అక్కడ కొంత మేర రోడ్డు ఆక్రమించి నిర్మాణాలు చేసినట్లుగా అభియోగాలు ఉన్నాయి. ఫుట్‍పాత్ ఆక్రమించి సెక్యూరిటీ పోస్ట్ ల నిర్మాణం చేసినట్లు గుర్తించారు. గతంలోనే వీటిని తొలిగించాలని నోటీసులు ఇచ్చారు.
లోటస్ పాండ్ లో ఆక్రమణల కూల్చివేత..!1#Lotuspond #YSJagan #YSJaganmohanReddy #Oenindiatelugu pic.twitter.com/VWDLh07mjT
— oneindiatelugu (@oneindiatelugu) June 15, 2024
ఈ సెక్యూరిటీ పోస్టుల ఆక్రమణలపై స్థానికుల ఫిర్యాదులు వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో..ఈ రోజు జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేయటం సంచలనంగా మారింది. షర్మిల ప్రస్తుతం కాంగ్రెస్ లోనే ఉండటం..తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతోంది. దీని పైన వైఎస్ కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తారో చూడాలి.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications