వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రతిజ్ఞ.!నగర పాలక సంస్థలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని సంవిదాన్ దివస్ సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ ప్రధాన కార్యాలయంలో అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్ సిబ్బందినుద్దేశించి ప్రసంగించారు. దేశ భవిష్యత్తును రూపొందించడంలో రాజ్యాంగంలోని ప్రియాంబుల్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నారు. నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవాన్నిసంవిధాన్ దివస్ గా జాతీయ న్యాయ దినోత్సవంగా ప్రతియేడు జరుపుకుంటున్నామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది, దేశాన్ని ఒకే తాటిపై నడిపించే రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, దాని ఫలాలను ప్రతిఒక్కరూ ఆస్వాదించాలని అన్నారు. భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ బాధ్యతగల పౌరులుగా ఎదుగాలన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్.

GHMC staff pledge.!Indian Constitution Day Celebration.!

అంతే కాకుండా ప్రజల ఆర్థిక, సామాజిక జీవనప్రమాణాలు పెంపొందించడానికి దేశాన్ని ఒక సంక్షేమ రాజ్యంగా రూపొందించడానికి ప్రాదేశిక సూత్రాలు రాజ్యాంగంలో పొందుపరిచారని తెలిపారు. ఈ సమావేశంలో చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్ రెడ్డి, అడిషనల్ కమిషనర్ అడ్మిన్ సరోజిని, డైరెక్టర్ ప్లానింగ్ శ్రీనివాస్, సిపిఆర్ఓ ముర్తుజా, సిబ్బంది పాల్గొన్నారు. కాగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్ టిసి ఆధ్వర్యంలో డిసెంబర్ 2, 3 తేదీల్లో జరుగనున్న ఈ- అక్షన్ ఉందని, జంటనగరాలు, శివారు ప్రాంతాల డెవలపర్స్, బిల్డర్లు, చిన్న, పెద్ద రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారి కోరిక మేరకు మరోసారి "ఉప్పల్ భగాయత్ ప్రి-బిడ్ మీటింగ్" నిర్వహించాలని హెచ్ఎండిఏ నిర్ణయించిందని హెచ్ఎండీఏ అధికారులు నిర్ణయించారు. శనివారం(27న) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటగంట వరకు బేగంపేట్ లోని "టూరిజం ప్లాజా"లో హెచ్ఎండిఏ నిర్వహిస్తున్న ప్రి బిడ్ మీటింగ్ కి డెవలపర్లు, వారి ప్రతినిధులు, ప్లాట్లు కొనుగోలుకు ఆసక్తి కలిగిన వారు అందరూ హాజరు కావాలని హెచ్ఎండిఏ అధికారులు కోరారు.

English summary
GHMC Commissioner DS Lokesh Kumar administered the oath of office to the officials at the headquarters on the occasion of Constitution Day, the Constitution Day of India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X