కలిసి వెళ్తుంటే: ప్రియుడ్ని చితకబాది యువతి గ్యాంగ్ రేప్

Posted By:
Subscribe to Oneindia Telugu

జగిత్యాల: తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాలలో కీచకపర్వం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి వెళ్తున్న యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన ప్రియుడిని చితకబాదారు.

జగిత్యాల జిల్లా హుస్నాబాద్‌కు చెందిన ప్రేమికులు బైక్‌పై వెళ్లడాన్ని అదే గ్రామానికి చెందిన వంశీ, రాజష్‌లతోపాటు మరో యువకుడు వీడియో తీశారు. తమకు లొంగకపోతే వీడియోని ఇంటర్నెట్లో పెడతామంటూ బెదిరించారు.

Girl gang raped by three in Jagityal district

బెదిరించి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. వారి వద్దనున్న సెల్‌ఫోన్‌, నగదును లాక్కున్నారు.ఇంటికి చేరుకున్న యువతి జరిగిన దారుణాన్ని కుటుంబ సభ్యులకు, బంధువులకు తెలిపింది.

గ్రామస్తులు, స్థానికులు ముగ్గురిలో ఇద్దరిని పట్టుకొని నడిరోడ్డుపై కట్టేసి చితక బాదారు. మరొకతను పారిపోయాడు. యువతి పరువు పోతుందనే కారణంగా పోలీసులకు ఫిర్యాదు చేయలేదని కుటుంబసభ్యులు అంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A girl has been gang raped in Jagityal district of Telangana.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి