ముజ్రా పార్టీ భగ్నం.. అమ్మాయిలతో అర్ధనగ్నంగా నృత్యాలు
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఏతబర్‌పల్లి గ్రామ శివారులోని హాలీడే ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. పుట్టినరోజు వేడుకల పేరుతో కొందరు యువకులు ముజ్రా పార్టీ ఏర్పాటు చేసినట్టు పోలీసులు గుర్తించారు. పార్టీ కోసం నిర్వాహకుడు ముంబై నుంచి యువతులను రప్పించినట్టు వెల్లడించారు. ఈ క్రమంలోనే అర్ద నగ్నంగా నృత్యాలు చేస్తున్న అమ్మాయిలు, అబ్బాయిలను అరెస్ట్ చేశారు.
అంతే కాకుండా పార్టీలో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి గంజాయి, హుక్కా పీలుస్తూ ఎంజాయ్ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ముజ్రా పార్టీ జరుగుతుందన్న పక్కా సమాచారంతో ఫామ్‌హౌస్‌పై దాడులు చేశామని ఎస్‌వోటీ పోలీసులు వివరించారు. ముజ్రా పార్టీ నిర్వహించిన నిర్వాహకుడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అలానే ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్‌తో పాటు పెద్ద మొత్తంలో మద్యంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడి నుంచి మరింత సమాచారం తెలుసుకునేందుకు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో దాడుల్లో భాగంగా.. వారి నుంచి భారీగా మద్యం, హుక్కా, గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో ఏడుగురు యువతులు, 14 మంది పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువకులు అందరూ పాత బస్తీకి చెందిన వారీగా పోలీసులు గుర్తించారు. యువతుల్లో ముంబై నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నట్టు సమాచారం.
ముజ్రా పార్టీ భగ్నం.. అమ్మాయిలతో అర్ధనగ్నంగా నృత్యాలు.!#Moinabad #ViralVideo #Party #Telangana #OITelugu pic.twitter.com/D6BbwmDZmt
— oneindiatelugu (@oneindiatelugu) April 9, 2025












Click it and Unblock the Notifications