రెస్టారెంట్ లకు వెళ్లి బిర్యానీలు లాగిస్తున్నారా? ఈ వీడియో చూస్తే తిన్నది కక్కేస్తారు!!
రెస్టారెంట్లకు వెళ్లి బిర్యానీలు ఆర్డర్ ఇచ్చి, ఘుమఘుమలాడే బిర్యానీ వచ్చిందని ఆహా ఏమి రుచి అంటూ లొట్టలేసుకుంటూ తినేవారికి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.. బాబోయ్ రెస్టారెంట్ లో ఫుడ్ మాకొద్దు అనేలా చేస్తుంది. చాలా మంది బయట ఫుడ్ లు తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఇంట్లో ఎంత బాగా వండి పెట్టినా ఏదో ఒక వంక పెడుతూ రెస్టారెంట్లకు వెళ్లి బరీగా లాగించేస్తుంటారు.
ఇక అట్లాంటి వారు ఇక ముందు రెస్టారెంట్లకు వెళ్లాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాల్సిందే. సిద్ధిపేట లోని సోనీ రెస్టారెంట్లో జరిగిన ఘటన తాలూకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బయట ఫుడ్డు తినాలంటే జనాలు భయపడుతున్నారు. అసలు ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉందంటే.. సిద్దిపేటలో సోనీ రెస్టారెంట్ కి వెళ్ళిన ఓ కస్టమర్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చి, టాయిలెట్ లోకి వెళ్ళాడు.

ఇక కస్టమర్ టాయిలెట్ కు వెళ్లేసరికి అక్కడ స్టాప్ టాయిలెట్ లోనే బిర్యానీ రైస్ కడుగుతూ కనిపించారు. ఏకంగా లెట్రిన్ కమోడ్ పక్కన బిర్యానీ రైస్ కడుగుతూ కనిపించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు కస్టమర్ హోటల్ యాజమాన్యాన్ని పిలిచి చెడామడా తిట్టి పోశాడు. ఇదేంటని ప్రశ్నిస్తే మోటర్ కాలిపోవడం వల్ల వాటర్ ప్రాబ్లం ఉందని, అందుకే ఇక్కడ బియ్యం కడుతున్నారని సమాధానం చెప్పారు.
సిద్దిపేటలో దారుణం: టాయిలెట్ లో బిర్యానీ రైస్ కడుగుతున్న సిబ్బంది..!! pic.twitter.com/XA4pGgDOGB
— oneindiatelugu (@oneindiatelugu) April 22, 2023
ఇక రెస్టారెంట్ వారు చెప్పిన సమాధానం విన్న కస్టమర్ ఇది మీ తప్పు కాదు ఇక్కడ తినడానికి వచ్చిన మాదే తప్పు అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంట్లో ఎంత బాగా వంట చేసినా ఇంట్లో తినకుండా బయట తినాలని ప్రతిరోజు పరుగులు తీసే వారు, ఒక నిమిషం ఆగి ఈ వీడియో చూసిన తర్వాత బయట బిర్యానీలు తినడానికి వెళ్లొచ్చు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications