హైదరాబాద్ TO గోకర్ణ.. తక్కువ బడ్జెట్ లో ట్రిప్.. ఎలా వెళ్లాలి..?
బీచ్ లు అంటే మనకు గోవా గుర్తుకువస్తుంది. కానీ కర్ణాటకలోని గోకర్ణ ప్రాంతం బీచ్ లకు, ట్రెక్కింగ్ కు ప్రసిద్ధి చెందింది. గోకర్ణలో ప్రసిద్ధమైన ఆలయాలు కూడా ఉన్నాయి. ఓ వైపు ఆలయాల సందర్శన.. మరోవైపు బీచ్ లో ఎంజాయ్ చేయాలనుకునేవారికి ఈ ట్రిప్ బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ను ఇస్తుంది. ప్రకృతి ఒడిలో హాయిగా సేద తీరవచ్చు. తక్కువ బడ్జెట్ లోనే గోకర్ణ, దండేలి ప్రాంతాలను చుట్టి రావచ్చు. గోకర్ణ పట్టణంలో బీచ్ ఉంటుంది. అలాగే కుడ్లే బీచ్ సమీపంలో ఉంటుంది. ఓం బీచ్, హాఫ్ మూన్ బీచ్ , ప్యారడైజ్ బీచ్, బెలేకన్ బీచ్ ఉన్నాయి.
హైదరాబాద్ నుంచి గోకర్ణ వెళ్లాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్.. హైదరాబాద్ నుంచి ప్రతిరోజూ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్ నుంచి హుబ్లీకి ప్రతిరోజు సాయంత్రం 3 గంటల 50 నిమిషాలకు రైలు అందుబాటులో ఉంటుంది. HYD UBL EXP(17320) రైలు ఎక్కితే హుబ్లీలో తెల్లవారుజామున ఉదయం 6 గంటల 35 నిమిషాలకు చేరుకుంటారు. స్లీపర్ టికెట్ రూ. 370 గా ఉంది. హుబ్లీ నుంచి గోకర్ణ, దండేలి, మహాబళేశ్వరం వెళ్లేందుకు క్యాబ్ తీసుకోవాలి. నలుగురు వ్యక్తులు కలిసి క్యాబ్ తీసుకుంటే రూ. 12 వేలతో అయిపోతుంది. ఒక్కొక్కరికి రూ. 3 వేలు పడుతుంది.

హుబ్లీ నుంచి దండేలి చేరుకున్నాక.. ఒక రోజుకు ప్యాకేజీ తీసుకోవచ్చు. ఈ ప్యాకేజీలో భాగంగా మూడు పూటలా భోజనం, స్నాక్స్ తో పాటు మూడు వాటర్ యాక్టివిటీలు చేయవచ్చు. కైకింగ్, బోటింగ్, జోర్బింగ్ చేయవచ్చు. ఇండోర్ యాక్టివిటీలు ట్రెక్కింగ్, క్యాంప్ ఫైర్, క్యారమ్స్, రెయిన్ డ్యాన్స్, డార్ట్ బోర్డ్, ఆర్చరీ, బ్యాడ్మెంట్, వాలీబాల్, స్విమ్మింగ్ పూల్ .. తదితర యాక్టివిటీలు ఉంటాయి. ఆ తర్వాత గోకర్ణ టూర్ లో భాగంగా.. విబూధి వాటర్ ఫాల్స్, మురుడేశ్వర్, హోన్నవర్ ప్రాంతాలను సందర్శించవచ్చు. ఇతర ఫేమస్ బీచ్ లను చూడొచ్చు. ట్రెక్కింగ్ చేయవచ్చు.
ఆ తర్వాత తిరుగు ప్రయాణంలో భాగంగా హుబ్లీ నుంచి హైదరాబాద్ కు రోజూ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. స్లీపర్ టికెట్ ధర రూ. 370.. హుబ్లీ జంక్షన్ లో రాత్రి 8 గంటల 50 నిమిషాలకు ఎక్కితే.. హైదరాబాద్ ఉదయం 10 గంటల 40 నిమిషాలకు చేరుకోవచ్చు. తక్కువ బడ్జెట్ లోనే ఈ ట్రిప్ ముగుస్తుంది.
-
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దేశంలో బెస్ట్ ట్రెక్కింగ్ స్పాట్స్ ఇవే.. లైఫ్ లో ఒక్కసారైనా వెళ్లి రావాల్సిందే..! -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
IPL మ్యాచ్లకు ఉచితంగా 3 టికెట్లు - కండీషన్స్ అప్లై..!! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
సమ్మర్ లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఇదే.. అస్సలు మిస్ అవ్వకండి..! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!!












Click it and Unblock the Notifications