హైదరాబాద్‌లో ఆల్ టైమ్ రికార్డ్ కొట్టిన బంగారం ధరలు..
భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహిళలకు బంగారు ఆభరణాలపై ఉండే ఇష్టం అంతా ఇంతా కాదు. సీజన్లతో సంబంధం లేకుండా బంగారాన్ని కొనుగోలు చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా పసిడి ధరలు మరింత పైపైకి పోతూనే ఉంటున్నాయి. అయితే తాజాగా హైదరాబాద్ లో బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డు సృష్టించాయి.
హైదరాబాద్ నగరంలో బంగారం ధరలు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయానికి.. 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా రూ.1,00,110 కి చేరింది. ఇది బంగారం ధరల చరిత్రలోనే అత్యధికమని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల అని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,015 వద్ద గరిష్ఠ స్థాయిని తాకింది. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసి బులియన్ మార్కెట్ లో కొత్త రికార్డును క్రియేట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కారణంగా బంగారం కొనుగోళ్లు పెరగడంతో రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. అంతే కాకుండా అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం, డాలర్‌తో రూపాయి మారకం విలువలో చోటుచేసుకుంటున్న హెచ్చుతగ్గులు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం సహా ఇతర కారణాలు సైతం ధరలను ప్రభావితం చేస్తుందని అంటున్నారు. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలియాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.












Click it and Unblock the Notifications