తెలంగాణ అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు గుడ్‌న్యూస్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు శుభవార్త తెలిపింది. పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచడంతోపాటు పదవీ విరమణ తర్వాత ఆసరా పెన్షన్, ప్రత్యేక ఆర్థిక సాయంపై కీలక నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు 3989 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా స్థాయి పెంచుతూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.
ఉద్యోగ విరమణ చేసే అంగన్‌వాడీ ఉపాధ్యాయులకు రూ. లక్ష, మినీ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రూ. 50 వేల ప్రత్యేక ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విశాల దృక్పథంతో అంగన్వాడీల విషయంలో నిర్ణయం తీసుకున్నారని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హర్షం వ్యక్తం చేశారు. సీఎంకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి సత్యవతి రాథోడ్.. అంగన్వాడీ టీచర్లకు శుభాకాంక్షలు తెలిపారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా అంగన్వాడీ టీచర్లకు అత్యధిక వేతనాలు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని మంత్రి సత్యవతి వ్యాఖ్యానించారు. అంగన్‌వాడీల సమస్యల పట్ల తక్షణమే స్పందించిన సీఎం కేసీఆర్.. వాటిని పరిష్కరిస్తూ ఉత్తర్వులు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అంగన్వాడీల వేతనాల్లో కేంద్రం వాటా 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వ వాటా 10 శాతం ఉండేదని చెప్పారు.
ప్రస్తుతం మోడీ ప్రభుత్వం కేంద్రం వాటాను 90 శాతం నుంచి 60 శాతానికి తగ్గించిందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాల వాటాను 40 శాతానికి పెంచి కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పుకుంటోందని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అంగన్వాడీలకు ఇస్తున్న జీతాలు అరకొరగానే ఉన్నాయని వ్యాఖ్యానించారు. కాగా, తెలంగాణలో అంగన్వాడీలు మొత్తం 35,700 ఉండగా, వీటిలో 31,711 పెద్ద అంగన్వాడీలు, 3989 మినీ అంగన్వాడీలు ఉన్నాయి. ఇప్పుడు మినీ అంగన్వాడీలను కూడా ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?












Click it and Unblock the Notifications