Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

త్వరలోనే మరో క్షీర సంక్రాంతి. అక్కడ మహిళల జీవితాలలో కాంతి!

తెలంగాణ రాష్ట్రంలో మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. మహిళలను అన్ని రంగాలలోనూ ముందుకు తీసుకు వెళ్లడానికి విశేషమైన కృషి జరుగుతోంది. ముఖ్యంగా హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదం చేసే పరకాల ఇందిరా మహిళా డెయిరీ ఏర్పాటుకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.

పరకాల ఇందిరా మహిళా డెయిరీ ఏర్పాటుపై ఎమ్మెల్యే ఫోకస్
ములకనూరు మహిళా డెయిరీ స్ఫూర్తితో పరకాల లోను మహిళలతో డెయిరీ ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే డెయిరీ ఏర్పాట్లు వేగవంతం చేయడంతో పాటు, డెయిరీలో వివిధ సెక్షన్లలో పనిచేసే మహిళలకు శిక్షణ ఇప్పించారు. ఈ క్రమంలో నేడు హనుమకొండ భవాని నగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో డిఆర్‌డిఏ అధికారులు మరియు పరకాల ఇందిరా మహిళ పాల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య లిమిటెడ్ చీఫ్ ప్రమోటర్లతో సమావేశం నిర్వహించారు.

good news Parkal indira mahila dairy will start soon to women for financial growth

మహిళల కోసం మహిళలతో ఏర్పడుతున్న డెయిరీ
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆత్మవిశ్వాసం, బాధ్యతకు ప్రతిరూపమని అన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని, మహిళల కోసం మహిళలతో ఏర్పడిన పరకాల ఇందిరా మహిళా డెయిరీ రాష్ట్రంలో మరో ఆదర్శవంతమైన డెయిరీ అవుతుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.

10 వేల మందికి పైగా సభ్యులు, వారికి సబ్సిడీ రుణాలు
పరకాల ఇందిరా మహిళా డెయిరీకి ప్రస్తుతం 10 వేల మందికి పైగా సభ్యులు ఉన్నారని తెలిపారు. గేదెలు లేని మహిళలకు సబ్సిడీ రుణాలు, గడ్డి విత్తనాలు, మందులు, తక్కువ ధరలో దాణా, ప్రతి గ్రామంలో వెటర్నరీ సేవలు అందిస్తామని చెప్పారు. ముల్కనూరు డెయిరీ సహకారంతో శిక్షణ ఇస్తామని, 70 ఏళ్ల లోపు మహిళలు సభ్యత్వానికి అర్హులు అని తెలిపారు.

డెయిరీ పరిధిలో 58 పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు
చిన్న రైతులు, చిన్న కుటుంబాలు అభివృద్ధి చెందడమే లక్ష్యంగా పరకాల ఇందిరా మహిళా డెయిరీ కృషి చేస్తుందని అన్నారు. మొత్తం డెయిరీ పరిధిలో 58 పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు ఉన్నాయని అన్నారు. డెయిరీ కి సంబంధించిన పనులు త్వరితగతిన పూర్తి చేసి త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+