మరో శుభవార్త చెప్పేందుకు సిద్ధమైన రేవంత్ సర్కార్!

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాదికాలంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తోంది. ఇప్పటికే తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించి మహాలక్ష్మి పథకాన్ని అందుబాటులోకి తీసుకురాగా, గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ను అందిస్తోంది.

శుభవార్త చెప్పనున్న తెలంగాణా సర్కార్
500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ను, రైతులకు రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీని అందించి ప్రజాసంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వం తమదని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇక ఈ క్రమంలోనే తాజాగా మరో శుభవార్త చెప్పేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది.

Good news Revanth reddy govt ready to loan waive for handloom workers

ఆ నిధుల విడుదలకు ఆర్ధిక శాఖకు ఫైల్
ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా చేనేతలకు శుభవార్త చెబుతూ రేవంత్ ప్రభుత్వం చేనేత రుణమాఫీ పథకం అమలుకు రెడీ అయింది. దీనికోసం 58కోట్ల రూపాయలు అవసరమని గుర్తించిన ప్రభుత్వం నిధుల విడుదల కోసం ఆర్థిక శాఖకు ఫైల్ కూడా పంపించింది. చేనేతల రుణమాఫీ కోసం ఇప్పటికే చేనేత శాఖ ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపించిన క్రమంలో ఆర్థికశాఖ నుండి త్వరలోనే చేనేతల రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్ వస్తుందని భావిస్తోంది.

చేనేతల రుణ మాఫీపై కసరత్తు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 9వ తేదీన హైదరాబాద్లోని జాతీయ చేనేత సాంకేతిక సంస్థ ప్రారంభోత్సవంలో చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రుణమాఫీ పైన కసరత్తు ప్రారంభించిన చేనేత శాఖ ఈ మేరకు త్వరితగతిన చేనేతల రుణమాఫీ చేయాలని భావిస్తోంది.

మొత్తం రుణమాఫీ 58.10 కోట్లు ఇవ్వడానికి రంగం సిద్ధం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులు చేనేత సంఘాలు వివిధ బ్యాంకులలో మరియు జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్ల వివరాలను సేకరించి వాటన్నింటినీ పరిశీలించిన తర్వాత మొత్తం రుణమాఫీ 58.10 కోట్లు ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు.

ఆర్దిక శాఖ ఆమోదం వస్తే చేనేతలకు లబ్ది
దీని ద్వారా మొత్తం 7250 మంది కార్మికులకు 40.10 కోట్ల రూపాయల వ్యక్తిగత లోన్లు 91 చేనేత సహకార సంఘాలకు 18 కోట్ల మీద ఉన్న లోన్లు తీర్చనున్నారు ఆర్థిక శాఖ ఆమోద లభించిన వెంటనే రుణమాఫీ ప్రక్రియను చేపట్టి చేనేతలకు తెలంగాణ ప్రభుత్వం చేయూతనిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+