గ్రామపంచాయతీలకు కేంద్రం పండుగలాంటి వార్త .. రూ. 387 కోట్ల నిధుల విడుదల!

కేంద్ర ప్రభుత్వం మరోమారు గ్రామపంచాయతీలకు శుభవార్త చెప్పింది. 15వ ఆర్థిక సంఘం కింద గ్రామ పంచాయతీలకు 387 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఇప్పటికే మొదటి విడత 259.36 కోట్ల రూపాయలను విడుదల చేసిన కేంద్రం, రెండవ విడత 387 కోట్ల రూపాయలను విడుదల చేసింది. దీంతో ప్రస్తుతం ఈ నిధులు 646. 36 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి.

గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేస్తున్న కేంద్రం

తెలంగాణ రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం నుంచి మొత్తం మూడు వేల కోట్ల రూపాయలు రావాల్సి ఉండగా అవి తెలంగాణ గ్రామపంచాయతీ ఎన్నికలకు ముందు టెక్నికల్ సమస్యలతో ఆగిపోయాయి. ప్రస్తుతం గ్రామపంచాయతీల ఎన్నికలు పూర్తి అయ్యి కొత్త సర్పంచ్ లు పాలనా పగ్గాలు చేపట్టిన వేళ వరుసగా గ్రామపంచాయతీల నిధులు విడుదల కావడం పంచాయతీల కొత్త సర్పంచులకు సంతోషాన్ని కలిగిస్తుంది.

good news to gram panchayats center released again 387 crore rupees as 15th Finance Commission grants

ఇప్పటివరకు గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇచ్చింది ఇదే

గ్రామపంచాయతీ ఎన్నికలు పూర్తిచేసి కేంద్రం కోరిన సమాచారాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ సమర్పించడంతో ప్రస్తుతం విడతలవారీగా పంచాయతీలకు రావాల్సిన నిధులు విడుదలవుతున్నాయి. మొత్తం మూడు వేల కోట్ల రూపాయల బకాయిలను కేంద్రం ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు రెండు విడతలు 646. 36 కోట్ల రూపాయలు రాగా, ఇంకా 2,400 కోట్ల రూపాయలు రావలసి ఉంది.

గ్రామ పంచాయతీ నిధుల కోసం ఎవరేం చేశారు

గ్రామాల అభివృద్ధి కోసం పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కేంద్రం పైన ఒత్తిడి తెచ్చినట్టు, ఫలితంగానే నిధులు విడుదల అవుతున్నాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియకు ముందు టెక్నికల్ కారణాలతో నిధులు విడుదల కాలేదని, ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రస్తుతం కేంద్రం నిధులను విడుదల చేస్తుందని బీజేపీ చెప్తోంది.

ఈ నిధులతో అభివృద్ధి.. గ్రామాలలో హర్షం

ఈ మేరకు తాము కేంద్రానికి విజ్ఞప్తి చేశామని బిజెపి మంత్రులు సైతం చెబుతున్నారు. ఒక వారం రోజుల వ్యవధిలోనే రెండు విడతల నిధులు విడుదల కావడం అందరికీ సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ నిధులు గ్రామాలలో అభివృద్ధికి దోహదం చేస్తాయని గ్రామాలలో హర్షం వ్యక్తం అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+