ఇల్లు లేనివారికి సువర్ణావకాశం.. తక్కువధరకే ప్రభుత్వ ఫ్లాట్ల అమ్మకాలు, త్వరపడండి

తెలంగాణ రాష్ట్రంలో సొంతిల్లు లేని తక్కువ ఆదాయ వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తక్కువ ఆదాయ వర్గాలకు సొంతింటి కలను నిజం చేయాలన్న లక్ష్యంతో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ముఖ్య నగరాలలో వారికోసం ఫ్లాట్ లను విక్రయించడానికి రెడీ అవుతోంది.

ఆ నగరాలలో ఫ్లాట్ ల విక్రయం
ముఖ్యంగా హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ నగరాలలో సామాన్యులకు అందుబాటు ధరలో మొత్తం 339 ప్రభుత్వంచే నిర్మించబడిన ఫ్లాట్ లు విక్రయించడానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా మధ్యతరగతి, తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పెద్ద ఊరటగా మారనుంది. తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ వివరాల ప్రకారం హైదరాబాద్ గచ్చిబౌలిలో 111 ప్లాట్లు, వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలో 102 ప్లాట్లు, ఖమ్మం శ్రీరామ్ హిల్స్ ప్రాంతంలో 126 ఫ్లాట్ లు అందుబాటులోకి రానున్నాయి.

good news to middle calss people Affordable Housing flats for Low Income Groups

ఫ్లాట్ లు పొందాలంటే అర్హత ఇదే
ఈ ఫ్లాట్ లు నగరాల్లో కీలక ప్రాంతాలలో ఉండడంతో పాటు మౌలిక వసతులు కూడా సమృద్ధిగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఫ్లాట్లను పొందాలంటే ఏడాదికి ఆరు లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్న వారిని పరిగణనలోకి తీసుకుంటామని హౌసింగ్ బోర్డ్ స్పష్టం చేసింది. ఇప్పటికే అద్దె ఇళ్ళలో నివసించేవారు, సొంతిల్లు లేని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.

దరఖాస్తులకు లాస్ట్ డేట్ అప్పుడే
దరఖాస్తులు వచ్చేనెల మూడవ తేదీ లోపు సమర్పించాల్సి ఉంటుందని హౌసింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వీపి గౌతమ్ వెల్లడించారు. దరఖాస్తులు పరిశీలించిన అనంతరం పారదర్శక విధానంలో వేలం నిర్వహించి ఫ్లాట్ల కేటాయింపు చేపడతామని వెల్లడించారు. ఈ ప్లాట్ల వేలం ద్వారా తక్కువ ఆదాయ వర్గాల వారికి నగరాలలో సురక్షితమైన, సౌకర్యవంతమైన నివాసాన్ని ఏర్పరుచుకునే అవకాశం లభిస్తుంది.

మధ్యతరగతి ప్రజలకు సువర్ణావకాశం
మధ్యతరగతి వర్గాల వారికి ఈ చర్య సామాజిక భద్రతకు పట్టం కడుతుంది. ప్రస్తుతం ఫ్లాట్ల ధరలు కూడా విపరీతంగా కొనలేని స్థాయిలో పెరిగి ఉన్న నేపధ్యంలో సొంతిల్లు లేనివారు సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఈ అవకాశాన్ని అసలు వదులుకోకండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+