తెలంగాణా ప్రజలకు శుభవార్త.. ఇకపై ఈ స్టేషన్లలోనూ ఆగనున్న ఎక్స్‌ప్రెస్ రైళ్ళు.. వివరాలివే!!
తెలంగాణ రాష్ట్రంలోని రైల్వే ప్రయాణికులకు కేంద్ర రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. రైల్వే శాఖకు పదేపదే ప్రయాణికులు చేస్తున్న విజ్ఞప్తుల మేరకు స్పందించిన రైల్వే శాఖ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లకు అదనపు హాల్టింగ్ పాయింట్లను ఇస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.
ఇక కిషన్ రెడ్డి చేసిన ట్వీట్ లో అదనపు స్టాప్ పాయింట్లు ఇచ్చిన రైల్వే స్టేషన్లను వెల్లడించారు. సికింద్రాబాద్, హైదరాబాద్, గుంటూరు రైల్వే డివిజన్ల పరిధిలో నడిచే పలు రైళ్లకు తెలంగాణ రాష్ట్రంలోని 14 స్టేషన్లలో అదనపు స్టాప్ లు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. అందులో ఒక్క సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోనే 9 స్టేషన్లు ఉన్నట్టు కిషన్ రెడ్డి వెల్లడించారు.

ఇక ఆ వివరాల్లోకి వెళితే బల్లార్షా కాజీపేట ఎక్స్ప్రెస్ మందమర్రిలో, కాజీపేట బల్లార్షా ఎక్స్ప్రెస్ రాఘవపురంలో హాల్టింగ్ పాయింట్లుగా నిర్ణయించారు. పూణే కాజీపేట ఎక్స్ప్రెస్ మంచిర్యాలలో, దౌండ్ నిజామాబాద్ ఎక్స్ప్రెస్ నవీపేట లో, భద్రాచలం రోడ్డు బల్లార్ష సింగరేణి మెము ఎక్స్ప్రెస్ బేతంపూడి లో ఆగుతాయన్నారు.
నర్సాపూర్ నాగర్సోల్ ఎక్స్ప్రెస్ మహబూబాబాద్ లో, తిరుపతి ఆదిలాబాద్ కృష్ణ ఎక్స్ప్రెస్ మేడ్చల్ లో, సికింద్రాబాద్ తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్ మిర్యాలగూడలో ఆగనున్నట్టు పేర్కొన్నారు. సికింద్రాబాద్ భద్రాచలం రోడ్ కాకతీయ ఎక్స్ప్రెస్ తడికలపూడి లో, రేపల్లె సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ రామన్నపేట, తిరుపతి సికింద్రాబాద్ పద్మావతి ఎక్స్ప్రెస్ నెక్కొండలో హాల్టింగ్ పాయింట్లు ఇచ్చినట్టు వెల్లడించారు.
ఇక గుంటూరు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ఉందా నగర్ లో, కాజీపేట బల్లార్షా ఎక్స్ప్రెస్ ట్రైన్ రేచ్ని రోడ్డులో, భద్రాచలం రోడ్డు సికింద్రాబాద్ కాకతీయ ఎక్స్ప్రెస్ బేతంపూడి స్టేషన్లో ఆగనున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇక రైల్వే శాఖ తాజాగా ఎక్స్ప్రెస్ రైళ్ల స్టాప్ పాయింట్ల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి చేసిన మేలు నేపథ్యంలో రైల్వే ప్రయాణికులు రైల్వే శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications