ఆర్టీసీలో ఉద్యోగాలు..10 తరగతి ఉంటే చాలు నెలకు రూ. 60 వేల జీతం
నిరుద్యోగులకు ఇది నిజంగా అదిరిపోయే శుభవార్త. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC)లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు ఇది చక్కటి అవకాశం.
తెలంగాణ ఆర్టీసీలో 1,743 పోస్టులు ఖాళీ
తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్, శ్రామిక్ (కార్మిక్) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం 1,743 ఖాళీలు ఉన్నాయి.
పోస్టు పేరు - ఖాళీల సంఖ్య
డ్రైవర్ పోస్టులు 1,000
శ్రామిక్ పోస్టులు 743
మొత్తం 1,743

ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ప్రారంభం: అక్టోబర్ 8, 2025
చివరి తేదీ: అక్టోబర్ 28, 2025
దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్ ద్వారా మాత్రమే జరుగుతుంది.
అర్హతలు, వయోపరిమితి , జీతాలు
1. డ్రైవర్ పోస్టులు:
అర్హత: 10వ తరగతి పాస్ లేదా ఐటీఐ, డ్రైవింగ్ లైసెన్స్ మరియు పని చేసిన అనుభవం ఉండాలి.
వయోపరిమితి (2025 జులై 1 నాటికి): 22 నుంచి 35 ఏళ్లు.
వేతనం: నెలకు ₹20,960 - ₹60,080 వరకు.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ₹300, ఇతరులకు ₹600.
2. శ్రామిక్ పోస్టులు:
అర్హత: 10వ తరగతి పాస్ లేదా ఐటీఐ అర్హత ఉండాలి.
వయోపరిమితి (2025 జులై 1 నాటికి): 18 నుంచి 30 ఏళ్లు.
వేతనం: నెలకు ₹16,550 - ₹45,030 వరకు.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ₹200, ఇతరులకు ₹400.
వయోపరిమితిలో సడలింపు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, ఈఎస్‌ఎం (ఎక్స్-సర్వీస్‌మెన్) అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం
అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT): శారీరక కొలతల పరీక్ష.
మెడికల్ టెస్ట్: వైద్య పరీక్ష.
డ్రైవింగ్ టెస్ట్: (డ్రైవర్ పోస్టులకు మాత్రమే) నైపుణ్య పరీక్ష.
అర్హత ,ఆసక్తి ఉన్న అభ్యర్థులు చివరి తేదీకి ముందే TSRTC అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించడమైనది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications