నిరుద్యోగులకు శుభవార్త .. నేటి నుంచి గజ్వేల్‌లో ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ
నిరుద్యోగులకు శుభవార్త. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అవ్వాలి అనుకునేవారికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక సువర్ణ అవకాశాన్ని ఇస్తోంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్‌మెంట్ ర్యాలీని తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నేటి నుండి నిర్వహించనున్నారు.
నాలుగు రోజుల పాటు జరగనున్న రిక్రూట్మెంట్ ర్యాలీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసక్తి ఉన్న యువత పాల్గొనే ఈ ర్యాలీకి జిల్లా యంత్రాంగం మౌలిక వసతులు కల్పించింది.

రిక్రూట్మెంట్ ర్యాలీ సంబంధించి ఎయిర్‌ఫోర్స్ అధికారులు ఇటీవల ఏర్పాట్లను పరిశీలించి వెళ్లారు. 26, 27 తేదీలలో నల్గొండ సూర్యాపేట, యాదాద్రి, నిజామాబాద్, కామారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగామా, భూపాలపల్లి, మహబూబాబాద్, హైదరాబాద్ అభ్యర్థులకు, ఈ నెల 28, మార్చి 1న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, గద్వాల్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలకు చెందిన అభ్యర్థులకు రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనే అవకాశాన్ని కల్పించారు.
ఇక ఈ రిక్రూట్ మెంట్ ర్యాలీలో పాల్గొనే వారి విద్యార్హతగా ఇంటర్మీడియట్‌లో 90శాతంతో ఉత్తీర్ణత సాధించి 19, జనవరి 1999 నుంచి 1 జనవరి 2003 మధ్యకాలంలో జన్మించిన వారు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాల్సిందిగా అధికారులు తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications