హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కంచ అయిలయ్యపై చట్టపరమైన చర్యలు: నాయిని నర్సింహ్మరెడ్డి

వివాదాస్పద పుస్తక రచయిత కంచ అయిలయ్యపై ప్రభుత్వం చట్టపరంగా వ్యవహరిస్తోందన్నారు నాయినిగురువారం నాడు హైద్రాబాద్‌లో మంత్రి నాయిని ఈ ప్రకటన చేశారు. హోంగార్డుల సమస్యలను పరిష్కరిస్తామని ప్రకటించిన నాయిని

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వివాదాస్పద పుస్తక రచయిత ప్రోఫెసర్ కంచ అయిలయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకొంటామని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి చెప్పారు.

గురువారం హైద్రాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న హోం మంత్రి మీడియాతో మాట్లాడారు.. కంచె ఐలయ్యపై కేసులు నమోదై ఉంటే తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Governament will take necessary action on Kancha ilaiah: Nayani Narsimha reddy

బతుకమ్మ చీరల వివాదంపై స్పందించిన ఆయన.. బతుకమ్మ చీరలపై ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. ప్రతిపక్ష పార్టీల సర్పంచ్‌లు చీరలను తగులబెట్టిస్తున్నారని చెప్పారు. హోంగార్డుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని హోంమంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి చెప్పారు.

హోంగార్డులు ఎవరూ కూడ ఆత్మహత్యలకు పాల్పడొద్దని కోరారు. కాగా, ఆర్య వైశ్యులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కంచె ఐలయ్య పుస్తకం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పుస్తకం తెలుగు రాష్ట్రాల్లో తీవ్రదుమారం రేపింది.

English summary
Telangana home minister Nayani Narasimha reddy responded on Kancha ilaiah.Nayani said that Telangana government will take necessary action on kancha ilaiah
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X