హైడ్రా చట్టబద్ధత ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం: గెజిట్ విడుదల

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేవంత్ రెడ్డి సర్కారు మున్సిపల్ చట్టంలో మార్పులు చేసింది. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. హైడ్రాకు చట్టబద్ధతను కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో ఆర్డినెన్స్ పై సంతకం కోసం రాజ్‌భవన్‌కు పంపింది.

హైదరాబాద్‌ విపత్తు స్పందన, ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ ఏజెన్సీ (Hydra)కి విస్తృతాధికారాలు కల్పిస్తూ రాష్ట్ర సర్కార్​ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు శనివారం తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఆమోదం తెలిపారు. ఈ మేరకు శనివారం రాజ్‌భవన్‌ గెజిట్‌ నోటిఫికేషన్ రిలీజ్​ చేసింది. అంతకుముందు హైడ్రా ఆర్డినెన్స్‌పై గవర్నర్ పలు సందేహాలు వ్యక్తం చేయగా.. పురపాలక ముఖ్య కార్యదర్శి దానకిశోర్ నివత్తి చేయడంతో తాజాగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోద ముద్ర వేశారు.

Governor s approval of HYDRA Ordinance Gazette released

దీంతో ఇకపై హైడ్రా చేపట్టబోయే అన్ని కార్యకలాపాలకు చట్టబద్ధత లభించింది. ఈ చట్టాన్ని రాబోయే శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. అప్పటివరకు హైడ్రాకు ఈ ఆర్డినెన్స్‌ రక్షణగా నిలవనుంది. జీహెచ్ఎంసీ చట్టంలో సవరణకు గవర్నర్ ఆమోదం తెలపగా, జీహెచ్ఎంసీ చట్టంలో కొత్తగా 374(బి) సెక్షన్ చేరుస్తూ ఆర్డినెన్స్‌ జారీ చేశారు.

కాగా, చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను హైడ్రా ఇటీవల కూల్చివేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు హైడ్రా చట్టబద్ధతపై హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా, గవర్నర్ ఆమోదం లభించడంతో అసెంబ్లీలో ఆమోదం తెలిపి హైడ్రాకు చట్టబద్ధతను పూర్తిస్థాయిలో తీసుకురానున్నారు.

కాగా, హైదరాబాద్ నగర పరిధిలో నీటి వనరులు, ప్రభుత్వ ఆస్తులు, స్థలాలను కాపాడే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. జులై 19న హైడ్రాను జీవో ఎంఎస్ 99 ద్వారా ఏర్పాటు చేశారు. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో పరిధిలో ఓఆర్ఆర్ వరకు ఉన్న ప్రాంతాన్ని హైడ్రా పరిధిలో చేర్చారు. ఆ తర్వాత హైడ్రాకు క్రమంగా అధికారాలను పెంచుకుంటూ వచ్చింది ప్రభుత్వం. హైడ్రాకు ప్రత్యేక అధికారాలతోపాటు సిబ్బందిని కూడా పెద్ద ఎత్తున నియమించింది. తాజాగా, గవర్నర్ ఆమోదంతో హైడ్రా.. అక్రమ నిర్మాణాలపై మరింత దూకుడును ప్రదర్శించే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+