Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

2024 ఏడాదికి సెలవులు ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం: ముఖ్య తేదీలివే

2024 ఏడాదికిగాను సాధారణ, ఐచ్ఛిక సెలవులు ఖరారు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2024లో మొత్తంగా 27 సాధారణ సెలవులు, 25 ఐచ్ఛిక సెలవులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కొత్త ఏడాది సందర్భంగా జనవరి ఒకటో తేదీన సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. అందుకు బదులుగా ఫిబ్రవరి 10వ తేదీన రెండో శనివారాన్ని పనిదినంగా ప్రకటించింది.

2024 ఏడాది మొత్తం 52 సెలవులు ఉండగా.. వీటిలో 27 జనరల్‌ హాలీడేస్‌, 25 ఆప్షనల్‌ హాలీడేస్‌ ఉన్నాయి. 5 ఆప్షనల్‌ హాలీడేస్‌కు మించకుండా సెలవులు తీసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇక అన్ని ఆదివారాలతో పాటు అన్ని నెలల్లో రెండో శనివారాలు సెలవు దినాలుగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, జనవరి 1వ తేదీన సెలవు దినంగా ప్రకటించిన నేపథ్యంలో ఫిబ్రబరి నెలలో రెండో శనివారం పని దినంగా ప్రకటించారు.

Govt releases General holidays list for the year-2024 in telangana

ఈ ఒక్క రోజు మినహా అన్ని రెండో శనివారాలను సెలవు దినాలుగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆప్షనల్‌ హాలీడేస్‌ను ఉపయోగించుకోవడానికి అనుమతి కోసం ముందస్తుగానే రాతపూర్వకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఉత్వర్వుల్లో వెల్లడించారు. ఇదుల్‌ అహా, మొహరాం, ఇద్‌ ఇ మిలాద్‌ పండుగల సెలవుల తేదీలను ప్రస్తుతం ప్రకటించినప్పటికీ.. ఆ సమయానికి మార్పులు చేర్పుల ఆధారంగా సెలవు తేదీని తిరిగి ప్రకటిస్తామని, ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తామని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

2024 ఏడాది ప్రధాన పండుగల విషయానికొస్తే సంక్రాంతి జనవరి 14, ఉగాది ఏప్రిల్‌ 9, బక్రీద్‌ జూన్‌ 17వ తేదీ, వినాయకచవితి సెప్టెంబర్‌ 17వ తేదీ, అక్టోబర్‌ 12వ తేదీ విజయదశమి, అక్టోబర్‌ 31 దీపావళి, డిసెంబర్‌ 25వ తేదీన క్రిస్మస్‌ సెలవులు ఉన్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+