చేనేత వస్త్ర ఉత్పత్తి కి జిఎస్టీ దెబ్బ.ఆర్థిక సమస్య ల్లో చేనేత సహకార సంఘాలు

Subscribe to Oneindia Telugu

కరీంనగర్: చేనేత వస్త్ర ఉత్పత్తిని ఆధారం చేసుకుని జీవిస్తున్న చేనేత కుంటుంబాలకు, వాటిని పోషిస్తున్న సహకార సంఘాలకు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. రెండు నెలలుగా ఉత్పత్తి చేసిన వస్త్ర నిల్వలు కొనుగోళ్లు లేక నిలిచిపోయాయి.

చేనేత వస్త్రాలపై జీఎస్టీ విధించడంతో తమకు నష్టం తప్ప ఆశించిన ప్రయోజనం ఉండదని.. దీన్ని ఎత్తివేయాలని చేనేత సంఘాలు కోరుతున్నాయి. జిల్లాలోని 20 సంఘాల్లో రూ. 3 కోట్లకు పైగా విలువ చేసే వస్త్రాలు కొనుగోళ్లు పేరుకుపోయాయి..

దీంతో వస్త్ర ఉత్పత్తిపై ఆధారపడ్డ కార్మికులకు సమయానికి కూలీ డబ్బులు చెల్లించే పరిస్థితి లేకుండా పోయింది. మరోవైపు జీఎస్టీ ఉంటేనే వస్త్ర కొనుగోళ్లు చేస్తామని టెస్కో చెబుతోంది.

కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి, రామడుగు, గంగాధర, పెగడపల్లి, చొప్పదండి మండలాల్లోని 35 గ్రామాల్లో సంఘం విస్తరించి ఉంది. మొత్తం 200 మంది కారమికులు ఉన్నారు. చేనేత మగ్గాలపై కార్మికులు తువ్వాలలు, లుంగీలు, షర్టింగ్‌, డోర్‌ కర్టన్లు, డబుల్‌కాట్‌ బెడ్‌షీట్లు, దస్తకార్‌ ఆంధ్ర కాటన్‌ వంటి వస్త్రాలు ఉత్పత్తి చేస్తారు

జిఎస్టీ ఎత్తివేయాలని డిమాండ్

జిఎస్టీ ఎత్తివేయాలని డిమాండ్

కరీంనగర్‌ జిల్లాలో 20 చేనేత సహకార సంఘాల పరిధిలో రెండు నెలలుగా కొనుగోళ్లు లేక దాదాపు రూ.3కోట్ల విలువైన వస్త్రాలు సంఘాల పరిధిలో నిల్వ ఉన్నాయి. వీటిని రాష్ట్ర ప్రభుత్వపరంగా టెస్కో కొనుగోలు చేస్తోంది.. జీఎస్టీ ఉంటేనే కొనుగోలు చేస్తామని టెస్కో చెప్పడంతో కొన్ని సంఘాలు ముందుకు రాక కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఎట్టి పరిస్థితుల్లో సంఘాలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి దానికి అవసరమైన పత్రాలు, నంబరు ఉంటేనే కొనుగోలు చేస్తామంటోంది. దీంతో కొన్ని సంఘాల పాలకవర్గాలు ఇబ్బందుల్లో పడ్డాయి. జీఎస్టీ పేరిట 5 శాతం పన్ను విధిస్తే సంఘాలకు ఆశించిన ప్రయోజనం ఉండదని.. ఎత్తి వేయాలని కోరుతున్నాయి. అయినా జీఎస్టీ లేకుండా కొనుగోలు చేసేది లేదని టెస్కో చెబుతోంది.

జీఎస్టీతో నష్టమే

జీఎస్టీతో నష్టమే

చేనేత వస్త్రాలపై విధించిన 5 శాతం జీఎస్టీని ఎత్తివేయాలని రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చేనేత సంఘాల పాలకవర్గాలు విన్నవించాయి. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్‌ దృష్టికి కూడా తీసుకెళ్లారు. జీఎస్టీ ఎత్తివేసి చేనేత సంఘాలకు చేయూతనివ్వాలని కోరుతున్నాయి. జీఎస్టీ పరిధిలోకి వచ్చిన సంఘాల వస్త్రాలను కొనుగోలు చేస్తామని టెస్కో చెబుతోంది. మెజార్టీ సంఘాలు మాత్రం ఈ విషయంలో ఒక నిర్ణయానికి రాలేదు. ఫలితంగా కొనుగోళ్లు ఆగిపోయి అవసరమైన డబ్బు లేక వస్త్ర ఉత్పత్తి చేసిన కార్మికులకు వేతనాలు ఆలస్యంగా చెల్లించాల్సి వస్తోంది.. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాల్సిన అవసరం ఉంది.

3. చేతినిండా పనిలేదు

3. చేతినిండా పనిలేదు

సంఘంలో ఉత్పత్తి అయ్యే వస్త్రాలు ఎప్పటికప్పుడు టెస్కో కొనుగోలు చేస్తేనే తమకు చేతి నిండా పని దొరుకుతుందని కొత్తపల్లికి చెందిన చంద్రమౌళి అనే చేనేత కార్మికుడు చెప్పారు. సంఘంపై ఆధారపడ్డ ప్రతి ఒక్కరికీ పని లభిస్తుందన్నారు.. నెలల తరబడి ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం. సంఘం సహకార బ్యాంకు నుంచి అప్పు తెచ్చి మాకు వేతనాలు చెల్లిస్తోంది.ప్రభుత్వం చేనేత సహకార సంఘాలను బలోపేతం చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడితేనే వృత్తి పనిపై ఆధారపడిన కార్మికుల కుటుంబాలకు మేలని చేనేత కార్మికుడు గాజంగి భాస్కర్ అభిప్రాయపడ్డారు.

వెంకటేశ్వర్లు, సహాయ సంచాలకులు చేనేత జౌళిశాఖ

వెంకటేశ్వర్లు, సహాయ సంచాలకులు చేనేత జౌళిశాఖ

జీఎస్టీ అనే అంశం ప్రభుత్వానికి సంబంధించిందని అధికారులు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే పలు రూపాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినట్టు చెప్పారు అధికారులు.చేనేత కార్మికుల ఇబ్బందులను మరోసారి రాష్ట్ర మంత్రి కెటిఆర్ దృష్టికి తీసుకెళ్ళనున్నట్టు చెప్పారు చేనేత జౌళిశాఖ ఎడి వెంకటేశ్వర్లు.

చేనేత పరిశ్రమపై 5 శాతం జీఎస్టీ ఎత్తివేయాలన్న సంఘాల విజ్ఞప్తిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళనున్నట్టు చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Goods and Services Tax is one of the toughest of the economic reforms that this government has initiated and it is being touted as the 'greatest' by the government.Perhaps, it is and, may be, it is not. It is for the economists and subject experts to comment more on it. But, when it comes to the handloom sector, it leaves everyone worried. Will the sector survive the GST regime and continue

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి