వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మాయిగా నమ్మించి అకౌంట్ హ్యాక్.. వ్యాపారిని బెదిరించి కటకటాలపాలైన కేటుగాడు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఫేస్‌బుక్‌లో పలకరిస్తాడు. అమ్మాయిలా నమ్మిస్తాడు. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి చాటింగ్ మొదలుపెడతాడు. బుట్టలో పడ్డారని అర్థమవగానే ఇక వారి గుట్టు అంతా తెలుసుకుంటాడు. ఫిషింగ్ లింక్ పండి సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ చేసి బ్లాక్ మెయిలింగ్ మొదలుపెడతాడు. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఓ బిజినెస్‌మేన్ ఇచ్చిన కంప్లైంట్‌తో పోలీసులు మనోడి ఆట కట్టించారు. అరెస్ట్ చేసి ఊచలు లెక్కపెట్టిస్తున్నారు.

అమ్మాయి పేరుతో ఫేక్ ప్రొఫైల్

అమ్మాయి పేరుతో ఫేక్ ప్రొఫైల్

మౌలాలీ హెచ్‌బీ కాలనీకి చెందిన మహ్మద్ మునీర్ అహ్మద్ బీటెక్ కంప్లీట్ చేశాడు. ఎథికల్ హ్యాకింగ్ వర్క్‌షాప్‌కు వెళ్లి హ్యాకింగ్‌లో మెళకువలు నేర్చుకున్నాడు. అయితే మంచి కోసం ఉపయోగించాల్సిన హ్యాకింగ్‌ను స్వార్థ బుద్ధితో డబ్బులు సంపాదించే సాధనంగా మార్చుకోవాలనుకున్నాడు. ఇందులో భాగంగా మెలిన్ సోఫియా పేరుతో ఓ అమ్మాయి ప్రొఫైల్ పిక్ పెట్టి ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేశాడు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ రావడంతో యాక్సెప్ట్ చేశాడు.

 ఫిషింగ్ లింక్ పంపి

ఫిషింగ్ లింక్ పంపి

అమ్మాయితో మాట్లాడుతున్నానని భావించిన ఎదుటి వ్యక్తి తనకు సంబంధించిన వివరాలన్నీ చెప్పాడు. తానో వ్యాపారినని చెప్పడంతో మునీర్ అహ్మద్ అతన్ని దోచుకునే ప్లాన్ రెడీ చేశాడు. జడ్ షాడో యాప్ ద్వారా ఫిషింగ్ లింక్‌ను సదరు బిజినెస్‌మేన్‌కు పంపాడు. అది ఫిషింగ్ లింక్ అని తెలియని అవతలి వ్యక్తి దానిపై క్లిక్ చేశాడు. ఇక అంతే మునీర్ సదరు వ్యక్తి ఫేస్‌బుక్ అకౌంట్‌ను తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు. యూజర్ నేమ్, పాస్‌వర్డ్ మార్చేడయంతో పాటు బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్ కొట్టేసి బెదిరించడం మొదలుపెట్టాడు

వ్యాపారికి బెదిరింపులు

వ్యాపారికి బెదిరింపులు

సదరు వ్యాపారవేత్తకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో పెడతానని భయపెట్టాడు. అలా చేయకుండా ఉండాలంటే తాను అడిగినంత సొమ్ము ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో సదరు వ్యాపారి రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు టెక్నాలజీ సాయంతో మునీర్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు. మునీర్ మరికొందరి అకౌంట్లు హ్యాక్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దురాశకు పోయి బెదిరింపులకు పాల్పడిన మునీర్ ప్రస్తుకం కటకటాలు లెక్కపెడుతున్నాడు.

English summary
Youngster arrested for threatening business man in hyderabad. A 22-year-old man who attended workshops in ethical hacking used the acquired skills to hack into the Facebook account of a businessman and blackmail him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X