మహిళల ఖాతాల్లో రూ 2,500 జమ ఎప్పుడంటే..!!
తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు బడ్జెట్ ప్రవేశ పెట్టింది. ఈ బడ్జెట్ ప్రవేశ పెట్టే వేళ అసెంబ్లీకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. బడ్జెట్ ప్రతిపాదనలను ఆయన విమర్శించారు. కొత్తదనం లేదన్నారు. అదే తరహాలో మాజీ మంత్రి హరీష్ స్పందించారు. భట్టి ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు ప్రస్తావన లేదన్నారు. బడ్జెట్ ఆసాంతం ఆత్మస్థుతి, పరనింద తప్ప మరేమీ లేదని ఆయన విమర్శించారు.
బడ్జెట్ లో ఏమైంది
తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్ పైన హరీష్ కీలక వ్యాఖ్యలు చేసారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారని, కానీ బడ్జెట్‌లో మాత్రం ఆ ఊసే ఎత్తలేదని మండిపడ్డారు. ఆసరా పెన్షన్‌ల ప్రస్తావన తేకుండా వితంతువులు, వృద్ధులు, వికలాంగులను ప్రభుత్వం నిరాశపర్చిందని విమర్శించారు. కాంగ్రెస్ సర్కారుకు పేదల ప్రభుత్వం అని చెప్పుకునే అర్హత లేదని అన్నారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ నేతలు ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చారని, బడ్జెట్‌లో ఆ విషయాన్ని కూడా ఎక్కడా ప్రస్తావించలేదని హరీష్‌రావు ఆరోపించారు.

గొప్పలకు పోయారు
ఆర్భాటంగా అభయ హస్తం దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం.. ఇప్పుడు ఆరు గ్యారెంటీ ఊసెత్తలేదని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని గొప్పలకు పోయిన కాంగ్రెస్ సర్కారు.. బడ్జెట్‌లో ఆ ప్రస్తావనే తేకపోవడం దారుణమని అన్నారు. బడ్జెట్ పూర్తిగా అంకెల గారడీలా ఉన్నదని, ఇది రాష్ట్రాన్ని తిరోగమనం వైపు నడిపే బడ్జెట్ అని హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసరా పింఛన్‌లు పెంచుతామని ఎన్నికల్లో హామీలు ఇచ్చారని, వృద్ధుల పెన్షన్‌ను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు, వికలాంగుల పెన్షన్‌ను రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెంచుతామని చెప్పి.. బడ్జెట్‌లో ఆ ప్రస్తావన ఎందుకు చేయలేదని హరీష్‌రావు ప్రశ్నించారు.
మోసం చేసారు
ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఓట్లు దండుకున్న సర్కారు.. ఇప్పుడు రెండు లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడలేదని, మాయమాటలతో విద్యార్థులను మోసం చేసిందని హరీష్‌రావు మండిపడ్డారు. ఆటో కార్మికులకు రూ.12 వేలు ఇస్తామని ఎన్నికల సందర్భంగా చెప్పారని, ఇప్పుడు ఆ విషయం ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం వైఖరి కారణంగా ఇప్పటికే 50 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. ఇచ్చిన మాట తప్పడం ద్వారా ప్రభుత్వం పేదలను మోసం చేసిందని విమర్శించారు.












Click it and Unblock the Notifications