TSRTC ఆఫర్: సర్‌ప్రైజ్ గిఫ్ట్స్ ఇస్తామని ప్రకటన
హైదరాబాద్: ఇవ్వాళ స్నేహితుల దినోత్సవం. ఆగస్టులో వచ్చే మొదటి ఆదివారాన్ని ప్రపంచవ్యాప్తంగా ఫ్రెండ్‌షిప్ డేగా జరుపుకొనడం ఆనవాయితీగా వస్తోంది. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్.. వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అన్నీ ప్రెండ్‌షిప్ డే కొటేషన్లు, విషెస్‌లతో పోటెత్తుతున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో పలువురు సెలెబ్రిటీలు స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకొంటోన్నారు. తమ ప్రియమిత్రులను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ నటులు.. ఇందులో ముందువరసలో ఉన్నారు. పండుగలా జరుపుకొంటోన్నారు.

స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కూడా ప్రయాణికులకు బెస్ట్ విషెస్‌ను తెలియజేసింది. అక్కడితో ఆగలేదు. బస్టాపులు, బస్టాండ్లు, బస్సు ప్రయాణ సమయాల్లో ఏర్పడిన కొత్త పరిచయాలు, అవి స్నేహంగా మారిన సందర్భాల గురించి వివరించాలని ప్రయాణికులను కోరింది.
కొత్త వారితో ఏర్పడిన పరిచయం.. స్నేహంగా ఎలా మారింది? వాటిని ఇంకా కొనసాగిస్తున్నా?.. కొత్త పరిచయాలు చిగురించడానికి, స్నేహ సంబంధాలను కొనసాగించడానికి ఆర్టీసీ బస్టాండ్లు, బస్టాపులు, బస్సు ప్రయాణాలు ఎలా కారణం అయ్యాయనే విషయాలను తమతో పంచుకోవాలని టీఎస్ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది.
Forging friendships on Wheels: TSRTC is an integral part of our lives and has helped forge Friendships at TSRTC Bus Stops/ Bus Stations/Bus Journeys 🚌🌟
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) August 6, 2023
Share your friendship story forged through #TSRTC in the comments. Best Story will be picked for a Surprise 🎁 and will… pic.twitter.com/YZUbNCPdQV
తమ అనుభవాలను టీఎస్ఆర్టీసీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా తమకు షేర్ చేసుకోవాలని సూచించింది. ఇందులో బెస్ట్ స్టోరీని ఎంపిక చేసి.. వాటిని షేర్ చేసిన వారికి సర్‌ప్రైజ్ గిఫ్ట్స్ అందజేస్తామని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆయన అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆ బెస్ట్ స్టోరీని తమ అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పైనా షేర్ చేస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications