కెటీఆర్‌ను హరీష్ తిరస్కరిస్తారా: ఆ ప్రకటనలోని ఆంతర్యం అదేనా...
కెటిఆర్ నాయకత్వాన్ని అంగీకరించడానికి హరీష్ రావు సిద్ధంగా లేరా... మల్లుభట్టి విక్రమార్క ఈ విషయంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో ఇరువురు మంత్రులు కెటి రామారావుకు, హరీష్ రావుకు మధ్య నాయకత్వం కోసం అంతర్గత పోరాటం జరుగుతోందనే ప్రచారం నేపథ్యంలో కాంగ్రెసు తెలంగాణ నేత మల్లు భట్టి విక్రమార్క ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ఇరువురి మధ్య విభేదాలు మరింత పెరుగతాయని ఆయన అంటున్నారు.
కెసిఆర్ మరో 20 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటారని హరీష్ రావు అన్న మాటలకు మల్లు భట్టి విక్రమార్క కొత్త అర్థం తీశారు. కెసిఆర్ తర్వాత కెటిఆర్‌కు అధికారం అప్పగించాలనే ఆలోచనను హరీష్ రావు అంగీకరీంచడం లేదనే విషయాన్ని ఆ మాటలు పట్టిస్తున్నాయని ఆయన అన్నారు.

అంతేకాకుండా, కెసిఆర్ గానీ తాను గానీ ఉండాలని హరీష్ రావు భావిస్తున్నారు తప్ప మూడో వ్యక్తిని అంగీకరించడానికి సిద్ధంగా లేరని ఆయ న్నారు ఎన్‌ఎస్‌యుఐ 36వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జరిగిన సభలో ఆయన ఆదివారంనాడు ఆ వ్యాఖ్యలు చేశారు.
తెరాసలో అంతర్గత పోరు మరింత తీవ్రమవుతుందని, దానిపై కాంగ్రెసు నేతలు అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. హరీష్ రావును పార్టీ నుంచి పంపించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని మరో కాంగ్రెసు నేత సర్వే సత్యనారాయణ అన్నారు. కాంగ్రెసు ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేదని అనడాన్ని బట్టి హరీష్ రావు కాంగ్రెసులో చేరి, ఆ పార్టీ నాయకుడిగా ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారని ఆయన అన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications