రుణమాఫీపై రేవంత్ రెడ్డి సవాల్ ను స్వీకరిస్తున్నా: హరీష్ రావు
తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీపై అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటలు యుద్ధం కొనసాగుతుంది. ముఖ్యంగా హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం పీక్స్ కి చేరింది. ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీని రద్దు చేసుకుంటారా అని తాజాగా రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ ను తను స్వీకరిస్తున్నానని ప్రకటించారు.
రేవంత్ సవాల్ స్వీకరించిన హరీష్ రావు
ఆగస్టు 15 లో ఒక రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, రుణమాఫీ చెయ్యకపోతే మీరు సీఎం పదవికి రాజీనామా చేస్తారా అంటూ హరీష్ రావు రేవంత్ రెడ్డి కి సవాల్ విసిరారు. సంగారెడ్డి లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన హరీష్ రావు సీఎం సవాల్ తాను స్వీకరిస్తున్నాను అన్నారు.

ఆగస్టు 15న పూర్తిగా రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా
అధికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చేలా చూడాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మాపై ఉందని హరీష్ రావు అన్నారు. ఎల్లుండి అసెంబ్లీ ముందర అమరవీరుల స్థూపం దగ్గరికి తాను వస్తానని, దమ్ముంటే రేవంత్ రెడ్డి కూడా వచ్చి ఆగస్టు 15లోగా ఇచ్చిన అన్ని గ్యారంటీలు అమలు చేస్తానని ప్రమాణం చేయాలన్నారు. ఆగస్టు 15న పూర్తిగా రుణమాఫీ చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, మళ్లీ ఉపఎన్నికల్లో కూడా పోటీ చేయనన్నారు.
రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేస్తారా?
రుణమాఫీ చేయలేకపోతే మీరు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా? చెప్పాలని హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. గతంలో కొడంగల్లో ఓడిపోతే సన్యాసం తీసుకుంటానని చెప్పి తోకముడిచి మాట తప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని, ఇప్పుడు కూడా డిసెంబర్ 9 లోపు ఇచ్చిన ఆరు హామీలని అమలు చేస్తామని చెప్పి మాట తప్పారని ఎద్దేవా చేశారు.
మీ గురించి తెలంగాణా ప్రజలకు అర్ధమైంది
ఇప్పటికే తెలంగాణ ప్రజలను నిలువునా మోసం చేశారని, ఈ విషయం తెలంగాణ ప్రజలకు కూడా అర్థమైంది అన్నారు. పాలనా పగ్గాలు చేపట్టి 120 రోజులు దాటినా మీ గ్యారంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తెలంగాణా ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదన్నారు.
-
శుభవార్త: రేషన్ కార్డులు ఉన్నవారందరికీ 5లక్షల జీవిత బీమా.. పూర్తి వివరాలివే! -
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!!












Click it and Unblock the Notifications