కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి ప్లాన్ ఎవరిదో తేలిపోయింది: హరీశ్ రావు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తనపై చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అరకొర రుణమాఫీ ఘనత తన పుణ్యమేనని అన్నారు. రుణమాఫీ అయిందో లేదో సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లి చౌరస్తాలో చర్చకు సిద్ధమా? అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు సవాల్‌ విసిరారు.

రైతు రుణమాఫీ జరిగితే సురేందర్ రెడ్డి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడని హరీశ్ రావు ప్రశ్నించారు. సిద్దిపేట వెంకటాపురం గ్రామంలో 82మంది రైతులకు రుణమాఫీ కాలేదని వివరాలు పంపిస్తానని, మాఫీ చేయాలన్నారు. రైతు భరోసా ఇవ్వకుండా మోసం చేశారని సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.
రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని మోసం చేసింది రేవంత్‌రెడ్డి కాదా? అని హరీశ్ ​రావు ప్రశ్నించారు.

Harish Rao counter to cm revanth reddy s comments on him

రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేసింది మీరు కాదా? సీఎం పదవిలో కూర్చున్న వ్యక్తి హుందాగా మాట్లాడాలని హరీశ్ ​రావు హితవు పలికారు. రుణమాఫీ విషయంలో సీఎం ఒకరకంగా, వ్యవసాయశాఖ మంత్రి మరొకరంగా చెబుతున్నారని మండిపడ్డారు.

వానాకాలం రైతు భరోసా ఇప్పటి వరకు ఇవ్వలేదన్న ఆయన, అన్ని పంటలకు బోనస్‌ అని చెప్పి అంతా బోగస్‌ చేసిందెవరని నిలదీశారు. నాటి కేసీఆర్‌ సర్కార్‌ ముందుచూపుతో ఫార్మాసిటీకి సేకరించిన భూమిని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసమే ఫోర్త్‌ సిటీ అంటూ రేవంత్​ కొత్త రాగం ఎత్తుకున్నారని హరీశ్‌రావు ఆరోపించారు.

మరోసారి అధికారం తమదే అన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీశ్ రావు తనదైన శైలిలో స్పందించారు. దేశంలో ఎక్కడచూసినా కాంగ్రెస్‌ ఒక్కసారి మాత్రమే అధికారంలో ఉంటుందని హరీశ్ ​రావు విమర్శించారు. ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లో ఐదేళ్లకే కాంగ్రెస్‌ సర్కార్​ గద్దె దింపేశారని గుర్తు చేశారు. అదృష్టం కొద్దీ గెలిచిన రేవంత్‌రెడ్డి ఐదేళ్లు మాత్రమే పదవిలో ఉంటారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

బీఆర్ఎస్​ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి వ్యవహారంలో మంత్రులు ఓ రకంగా మాట్లాడుతుండగా.. సీఎం రేవంత్ మాత్రం నిజం ఒప్పుకున్నారని అన్నారు. బీఆర్ఎస్​ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి ప్లాన్‌ ఆయనదేనని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలతో రూఢి అయిందన్నారు హరీశ్‌ రావు. తమ వాళ్లకు సవాల్ విసిరితే.. తమ వాళ్లు ఏంటో చూపించారని రేవంత్ అన్నారని తెలిపారు. దీంతో తమ వారు ఎవరో తేలిపోయిందన్నారు. అరెకపూడి గాంధీని సీఎం రేవంత్ తమవారే అని చెప్పుకున్నారని హరీశ్ రావు అన్నారు.

పదే పదే తన ఎత్తుపై మాట్లాడటం సరికాదన్న హరీశ్‌రావు.. సీఎంగా ఉన్నవారు హుందాగా వ్యవహరించాలని రేవంత్‌రెడ్డికి హితవు పలికారు. తాను తాటి చెట్టంతా ఎదిగాను.. నీవు వెంప‌లి చెట్టంతా కూడా ఎద‌గ‌లేదు క‌దా..? అని రేవంత్ రెడ్డికి హ‌రీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు. సీఎం పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి తన గురించి కాకుండా ప్రజల గురించి ఆలోచించాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+