కెసిఆర్‌తో మైండ్ గేమ్: హరీష్ రావును టార్గెట్ చేసిన కాంగ్రెస్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో తాజాగా సంభవిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న వ్యవహారంపై కాంగ్రెసు నాయకులు మైండ్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తున్నారు. తన కుమారుడు, ఐటి శాఖ మంత్రి కెటి రామారావును తన వారసుడిగా ముందుకు తేవాలని కెసిఆర్ ప్రయత్నిస్తన్నారనే వార్తల నేపథ్యంలో ఆయన మేనల్లుడు, మంత్రి హరీష్ రావును కాంగ్రెసు నాయకులు టార్గెట్ చేసినట్లు కనిపిస్తున్నారు.

కెటి రామారావును తన వారసుడిగా కెసిఆర్ ప్రకటిస్తే హరీష్ రావు కాంగ్రెసులో చేరుతారనే ప్రచారాన్ని కూడా ప్రతిపక్ష నాయకులు సాగిస్తున్నారు. ప్రతి రోజూ హరీష్ రావు పేరును ప్రస్తావిస్తూ కెసిఆర్‌తో కాంగ్రెసు నాయకులు మైండ్ గేమ్ ఆడదుతున్నట్లు కనిపిస్తున్నారు.

అయితే, కెటిఆర్‌కు పార్టీలో ప్రమోషన్ కల్పించే విషయంపై కెసిఆర్ వెనక్కి తగ్గినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఆయనను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించాలని కెసిఆర్ భావించినట్లు వార్తలు వచ్చాయి. దానిపై దుమారమే చెలరేగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెసు నాయకులు హరీష్ రావును ముందుకు తెచ్చి కెసిఆర్‌ను చిక్కుల్లో పడేసే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు.

తెరాసలో హరీష్ రావు ఏకాకి...

తెరాసలో హరీష్ రావు ఏకాకి...

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో మంత్రి హరీశ్‌రావు ఏకాకి అవుతారని మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును చూసి కేసీఆర్ నేర్చుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోయినా చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ తెచ్చుకున్నారని గుర్తుచేశారు. కేసీఆర్ మాత్రం ప్రధాని మోడీ మనసు ఇస్తే చాలు .. నిధులివ్వాల్సిన అవసరం లేదంటున్నారని చెప్పారు. గులాబీ కూలీ అనేది లంచం తీసుకోవడంలో కొత్త విధానమని సర్వే సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

హరీష్ రావు కాంగ్రెసులోకి వస్తే...

హరీష్ రావు కాంగ్రెసులోకి వస్తే...

కాంగ్రెస్‌లో యోధానుయోధులు ఉన్నారని, అందువలల్ల హరీశ్‌రావు అవసరం లేదని, హరీశ్‌రావు కాంగ్రెస్‌లోకి వస్తే చిన్నవారవుతారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. తెరాసలో అంతర్గత పోరు వాస్తవమేనని ఆయన గురువారం మీడియాతో అన్నారు. టీఆర్‌ఎస్‌లో హరీశ్‌రావుది మొదటి నుంచి కీలక పాత్రే అని, వారసత్వ రాజకీయాల్లో హరీశ్‌రావు డౌన్ అయ్యారని జగ్గారెడ్డి అన్నారు. హరీశ్‌రావుకు టీఆర్ఎస్‌లో ఎప్పటికీ అవకాశాలు రావని ఆయన చెప్పారు.

హరీష్ రావును కాంగ్రెసులోకి తెస్తా...

హరీష్ రావును కాంగ్రెసులోకి తెస్తా...

మంత్రి హరీశ్‌రావు మంచి నేత, కాంగ్రెస్‌లోకి వస్తే బాగుంటుందని, హరీశ్‌రావును కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని కాంగ్రెస్‌ నేత ఉమేశ్‌రావు అన్నారు. తెరాసలో ముసలం పుట్టిందని, హరీశ్‌రావును టీఆర్‌ఎస్‌ పార్టీలో పక్కన పెడుతున్నారని ఆయన అన్నారు. హరీశ్‌రావు కాంగ్రెస్‌లో చేరితే పార్టీకి లాభం చేకూరుతుందని ఉమేశ్‌రావు అన్నారు.

 నేను అలా అనలేదని కవిత...

నేను అలా అనలేదని కవిత...

తన సోదరుడు కెటి రామారావును ఆశీర్వదించాలని తాను అనలేదని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు, కెసిఆర్ తనయ కల్వకుంట్ల కవిత అన్నారు. కెటిఆర్ కెసిఆర్ వారసుడిగా ముందుకు రావడం ఖాయమని ఆమె మాటలు కూడా తెలియజేస్తున్నాయని వార్తావ్యాఖ్యలు వచ్చిన నేపథ్యంలో ఆమె ఆ వివరణ ఇచ్చారు. తెరాసలోని అంతర్గత పోరు నేపథ్యంలోనే కెటీఆర్‌ను తన వారసుడిగా ప్రకటించే విషయంపై కెసిఆర్ వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు.

హరీష్‌పై కెసిఆర్‌కు అనుమానం వచ్చేలా...

హరీష్‌పై కెసిఆర్‌కు అనుమానం వచ్చేలా...

నిజంగానే హరీష్ రావు తిరుగుబాటు చేస్తారా అనే అనుమానం కలిగించే విధంగా కాంగ్రెసు నాయకులు, తెలుగు దేశం నాయకులు ప్రచారం సాగిస్తున్నారు. హరీష్ రావు కాంగ్రెసులో చేరుతారనే ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నారు. హరీష్ రావు తిరుగుబాటు చేయడం ఖాయమని రేవంత్ రెడ్డి వంటి తెలుదేశం నాయకులు అంటున్నారు. మొత్తం మీద, తెరాసలో అంతర్గతపోరు లేదా కుటుంబ పోరు జోరుగా సాగుతుందని ప్రజలను నమ్మించడానికి కూడా వారు ప్రచారం సాగిస్తున్నట్లు కనిపిస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress leaders like Sarvey Satyanarayana ar playing mind game with Telangana CM and Telangana Rastra samithi (TRS) chief K chandrasekhar Rao (KCR).
Please Wait while comments are loading...