వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంత మాటంటారా? క్షమాపణ చెప్పండి: హరీష్‌, అలా అనలేదని గీతారెడ్డి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డిపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు సోమవారం మండిపడ్డారు. శాసనసభలో సంక్షేమ పద్దులపై చర్చ కొనసాగుతున్న సందర్భంలో డిప్యూటీ స్పీకర్ కర్కశంగా వ్యవహరిస్తున్నారన్న మాటలను గీతారెడ్డి ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

గీతారెడ్డి తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని మంత్రి హరీష్‌రావు డిమాండ్ చేశారు. గీతారెడ్డి క్షమాపణ చెప్పాలని.. ఆ పదాలను రికార్డుల నుంచి తొలగించాలని హరీష్ డిమాండ్ చేశారు.

శాసనసభ్యుల సంక్షేమ కమిటీ సమావేశానికి స్పీకర్ మధుసూదనాచారి వెళ్లడంతో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి చైర్‌లో ఆశీనులయ్యారు. పద్దులపై చర్చ సందర్భంగా గీతారెడ్డి మాట్లాడుతూ.. డిప్యూటీ స్పీకర్ కర్కశంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.

Harish Rao fires at Geetha Reddy

కాగా, ఇలాంటి వ్యాఖ్యలు సరికాదు, చైర్‌లో ఉన్న వారిని అలా మాట్లాడం మంచిది కాదని హరీష్‌రావు హితవు పలికారు. ఇందుకు గీతారెడ్డి స్పందిస్తూ.. తాను అలా అనలేదని తెలిపారు.

పైకి కర్కశంగా కనిపించినప్పటికీ ఆమె సాఫ్ట్‌గా ఉన్నారని మెచ్చుకున్నానని గీతారెడ్డి తెలిపారు. హరీష్‌రావు తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు.

ప్రభుత్వానికి అక్బర్ అభినందనలు

హైదరాబాద్‌లో ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టిన ప్రభుత్వానికి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అభినందనలు తెలిపారు. శాసనసభలో ఓవైసీ మాట్లాడుతూ.. నగరాభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. హైదరాబాద్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేయాలని చెప్పారు.

English summary
Telangana Minister Harish Rao on Monday fired at Congress MLA Geetha Reddy for her comments on Deputy speaker.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X