చంద్రబాబుకు నీళ్ళు, ఢిల్లీకి నిధులు: ఇది రేవంత్ రెడ్డి పాలన!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలన పైన మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉప్పల్‌లో జరిగిన బీఆర్ఎస్వీ రాష్ట్ర స్థాయి విద్యార్థి సదస్సులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.
రేవంత్ రెడ్డి పాలనను, కేంద్ర ప్రభుత్వ పనితీరును టార్గెట్ చేసిన హరీష్ రావు
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రేవంత్ రెడ్డికి నిద్రలో కూడా కెసిఆర్ కనిపిస్తున్నాడని, రేవంత్ రెడ్డి నిత్యం కెసిఆర్ గురించి కలలు కంటున్నారని హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను, కేంద్ర ప్రభుత్వ పనితీరును టార్గెట్ చేసిన ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.

కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి రాజీనామాలు చేయకుండా పారిపోయారు
రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఎప్పుడు జై మోడీ, జై ఢిల్లీ అంటూ నినాదాలు చేస్తున్నారు తప్ప ఒక్కసారైనా తెలంగాణ అనకపోవడం వారి చిత్తశుద్ధికి నిదర్శనమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి వంటి నాయకులు ప్రజల కోసం అవసరమైనప్పుడు రాజీనామాలు చేయమని అడిగితే, రాజీనామాలు చేయకుండా పారిపోయారు అంటూ హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ద్రోహుల జాబితాలో మొదటి పేరు చంద్రబాబుది
రాజీనామా చేయమంటే రేవంత్ రెడ్డి జిరాక్స్ కాపీ ఇచ్చాడని అంతటి ఘనుడని ఎద్దేవా చేశారు. తెలంగాణ ద్రోహుల జాబితాలో మొదటి పేరు చంద్రబాబు నాయుడు ది, రెండవ పేరు రేవంత్ రెడ్డిదే ఉంటుందని హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వం చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు నీళ్లు, రాహుల్ గాంధీకి నిధులు వెళ్లేలా రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నారని హరీష్ రావు విమర్శించారు.
గురు శిష్యులు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేశారు
గురు శిష్యులు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని, కీర్తి తోరణాన్ని, ఉద్యమ స్మృతులను తొలగించడమే ప్రధాన లక్ష్యంగా రేవంత్ పాలన సాగుతుందని హరీష్ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహానికి కనీసం దండ కూడా వేయని వ్యక్తి రేవంత్ రెడ్డి అంటూ ఆయనను టార్గెట్ చేశారు.
రేవంత్ రెడ్డికి తెలంగాణకు తీరని అన్యాయం
రేవంత్ రెడ్డి ఎప్పుడు కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడతాడు అని, కానీ కెసిఆర్ గొప్ప విజన్ గల నాయకుడిగా ఏ రోజు కక్ష సాధింపులకు పాల్పడలేదని అన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని చెప్పిన హరీష్ రావు రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు.












Click it and Unblock the Notifications