మరో పదేళ్లు హైదరాబాద్ కామన్ క్యాపిటల్...!?
తెలంగాణలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. జూన్ 2తో రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తి కానుంది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాల పరిమితి ముగియనుంది. ఇక నుంచి హైదరాబాద్ కేవలం తెలంగాణ రాజధానిగా కొనసాగనుంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ గురించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌పై కాంగ్రెస్, బీజేపీలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.
హైదరాబాద్ పై చర్చ
హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుందా అనే చర్చ మొదలైంది. మరో పదేళ్లు హైదరాబాద్‌ను కామన్ క్యాపిటల్ చేసే కుట్ర జరుగుతోందని హరీష్ ఆరోపించారు. గతంలో పదేళ్లు కామన్ క్యాపిటల్ అంటేనే కేసీఆర్ వ్యతిరేకించారనీ గుర్తు చేశారు. ఇప్పుడు తిరిగి మరోసారి అలాంటి ప్రయత్నాలే కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్నాయనీ విమర్శించారు. హైదరాబాద్ ఇక కామన్ క్యాపిటల్ కాదు, తెలంగాణ క్యాపిటల్ అన్నారు హరీశ్‌రావు. కాంగ్రెస్, బీజేపీలకు అధికారమే ముఖ్యమని..కానీ తెలంగాణతో కేసీఆర్‌ది పేగుబంధమన్నారు.

మంత్రికి అవగాహన లేదు
జనాభా అవసరాలకు అనుగుణంగా, అత్యాధునిక, నాణ్యమైన వైద్యాన్ని పేద ప్రజలకు అందించేందుకు కేసీఆర్ ఆలోచనతో హైదరాబాద్ నలువైపులా టిమ్స్ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని నాటి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఆ దిశగా వేగంగా అడుగులు వేసిందని హరీశ్‌రావు గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విషం చిమ్మడం బాధాకరమన్నారు.కానీ 5 నెలలుగా ఆ నిర్మాణాలను, పనుల పర్యవేక్షణను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, లేని పోని ఆరోపణలు చేస్తున్నదని మండిపడ్డారు.
రాజకీయాలు సరికాదు
ఆస్పత్రులు త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలనే ఆలోచన పక్కనపెట్టి రాజకీయాలు చేస్తున్నదిని హరీష్ ఆగ్రహం వ్యక్తం చేసారు.టిమ్స్ ఎల్బీనగర్ ఆస్పత్రి నిర్మాణం జి+14 అంతస్తులు మాత్రమే అయితే 27 అంతస్తులు అని మాట్లాడడం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవగాహన రాహిత్యానికి నిదర్శనమని హరీశ్‌రావు విమర్శించారు. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో నిర్మిస్తున్న 22 అంతస్తుల ఆసుపత్రి ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. నిజంగా పేద ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే, త్వరితగతిన టిమ్స్ ఆసుపత్రి నిర్మాణాలను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేసారు.












Click it and Unblock the Notifications