మెట్రో రైలు కోసమే టీజీఎస్ఆర్టీసీని ఆగం చేస్తున్నారా?

టీజీఎస్ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపుదలకు నిరసనగా భారత్ రాష్ట్ర సమితి నేడు నిర్వహించ దలిచిన ఛలో బస్ భవన్ ఆందోళన, నిరసన ప్రదర్శన నేపథ్యంలో హైదరాబాద్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు బీఆర్ఎస్ టాప్ క్యాడర్ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటోన్నారు. హౌస్ అరెస్ట్ చేస్తోన్నారు. ఆయా నాయకుల ఇళ్ల ముందు పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఎవ్వరూ కూడా బయటికి రాకుండా పహారా కాస్తున్నారు.

దీనిపై వ్యతిరేకత ఎదురవుతోంది. బీఆర్ఎస్ తాజాగా ఛలో బస్ భవన్ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో బస్ భవన్ చేరుకోవాలని బీఆర్ఎస్ నాయకులు నిర్ణయించారు. నందినగర్ నుండి కేటీఆర్, మెహాదీపట్నం నుండి హరీష్ రావు, మహేశ్వరం నుండి సబితా ఇంద్రారెడ్డి, సికింద్రాబాద్ నుండి తలసాని శ్రీనివాస్ యాదవ్, చిలకలగూడ నుండి పద్మారావు గౌడ్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి బస్ భవన్ కు చేరుకోనున్నారు.

Harish Rao made significant remarks about TGSRTC and Revanth Reddy

ఇందులో పాల్గొనడానికి హరీష్ రావు మెహదీపట్నం బస్టాప్ కు చేరుకున్నారు. అంతకుముందు ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. కమీషన్ల కోసం బడా కాంట్రాక్టర్లకు ఎలక్ట్రిక్ బస్సుల కాంట్రాక్టులు కట్టబెట్టడానికి ఈ కుట్రకు తెరలేపాడని విమర్శించారు. ఆర్టీసీ డీజిల్ బస్సులు ఉండవని చెబుతూ ఉప్పల్, మియాపూర్ లో ఉన్న ఆర్టీసీ వర్క్ షాపులను అమ్మేస్తున్నాడని ధ్వజమెత్తారు.

జేబీఎస్ సహా రాష్ట్రంలో ఉన్న అనేక బస్టాండ్లను కుదవకు పెట్టి రేవంత్ రెడ్డి 1,500 కోట్ల రూపాయల అప్పు తెచ్చాడని హరీష్ రావు అన్నారు. ఉన్న బస్సులన్నీ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చి కిలోమీటర్‌కు రూ.59 కట్టబెట్టే కుట్ర చేస్తున్నాడని విమర్శించారు. మద్యం ధరలు విపరీతంగా పెంచిన రేవంత్ రెడ్డి అవ్వా తాతలకు ఇస్తానన్న 4,000 రూపాయల పెన్షన్ గురించి మాట్లాడట్లేదని, విత్తనాల ధర పెంచినా కూడా రైతులకు రుణమాఫీ చేయట్లేదని మండిపడ్డారు.

బస్సు టికెట్లు పెంచినా కూడా అక్క చెల్లెమ్మలకు ఇస్తానన్న మహాలక్ష్మి పథకం అమలు చేయలేదని హరీష్ రావు అన్నారు. మెహదీపట్నం నుండి సికింద్రాబాద్ వెళ్లడానికి రూ.25 ఉండే టికెట్ రేటు ఇప్పుడు రూ.35 చేశాడని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ఆర్టీసీ ధరలు పెంచి ఆర్టీసీ ఎక్కకుండా మెట్రో ఎక్కాలని కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. ఇప్పుడు ఆర్టీసీని ఆగం చేశాడని, ఇక మెట్రోను ఆగం చేస్తాడని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+