నా స్థాయి తగ్గించుకోవడమే: పవన్ కళ్యాణ్‌ను ఏకేసిన హరీష్ రావు

మెదక్‌: సినీ హీరో, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాన్ అవగాన లేకుండా మాట్లాడారని తెలంగాణ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నాయకుడు టి. హరీష్ రావు అన్నారు. పవన్ కళ్యాణ్ సోమవారం చేసిన వ్యాఖ్యలపై ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల వద్ద స్పందించారు.

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందిస్తే తన స్థాయిని దిగజార్చుకోవడమే అవుతుందని హరీష్ రావు అన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిన వాళ్లను, వారిని ప్రోత్సహించిన వాళ్లను వెనకేసుకొస్తూ పవన్‌ కళ్యాణ్ మాట్లాడారని హరీష్ రావు విమర్శించారు.

Harish Rao says Pawan Kalyan lacks understanding

ఆగస్టు 15 నుంచి సింగూరు ఆయకట్టుకు నీరు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సింగూరు కాల్వల నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేస్తామని, పనులను నిర్లక్ష్యం చేస్తే కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెడతామని హరీశ్‌రావు హెచ్చరించారు.సింగూరు జలాశయం వద్ద మంజీరా జలాలపై మంత్రి హరీష్‌రావు సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే బాబు మోహన్‌తో పాటు జిల్లా అధికారులు సింగూరు జలాశయం నుంచి ఖరీఫ్‌లో 10 వేల ఎకరాలకు నీరందిస్తామని చెప్పారు. హరీష్ రావు పదే పదే ఆంధ్రోళ్లు అని అంటూ ఉంటారని, ఆ పదం తనకు నచ్చదని పవన్ కళ్యాణ్ అన్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+