బ్యాలెట్ బయటకు తెచ్చి, ఓటు ఎక్కడ వేయాలని అడిగిన ఎమ్మెల్యే: క్లాస్ పీకిన హరీశ్

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ తెలుగు రాష్ట్రాల్లో ముగిసింది. తెలంగాణలో సీఎం కేసీఆర్‌తోపాటు దాదాపు సభ్యులందరూ పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, పోలింగ్ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.

ఓటు వేయడానికి పోలింగ్ బూత్‌లోకి వెళ్లిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బ్యాలెట్ పేపరు పట్టుకుని బూత్ బయటికి వచ్చారు. ఓటు ఎక్కడ వేయాలంటూ అడిగారు. దీంతో పక్కనే ఉన్న మంత్రి హరీశ్ రావు ఆయనను దగ్గరికి పిలిచి క్లాస్ పీకారు.

harish rao takes class to Muthireddy Yadagiri Reddy

ఓటు ఎలా వేయాలో ఇంతకుముందే చెప్పినప్పటికీ.. ఇదేంటని హరీశ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా వివరణ ఇచ్చేందుకు ముత్తిరెడ్డి ప్రయత్నించగా.. తనకేం వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని, నేరుగా ముఖ్యమంత్రికే వివరణ ఇవ్వాలని అన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana minister Harish Rao on Monday taken a class to MLA Muthireddy Yadagiri Reddy, when president polling continues.
Please Wait while comments are loading...