మంత్రి కేటీఆర్‌కు హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం

హైదరాబాద్: ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగే ఇండియా కాన్ఫరెన్స్‌లో పాల్గొనాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయితీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం వచ్చింది. ఫిబ్రవరి 6, 7 తేదీల్లో జరగనున్న యూనివర్సిటీ వార్షిక సదస్సుకు హాజరు కావాలని హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ టీమ్ కేటీఆర్‌కు ఆహ్వానం పంపింది.

Harvard University Invites KT Ramarao for India Conference in February

భారత్‌లో స్టార్టప్ కంపెనీల భవిష్యత్, దేశ సమగ్రాభివృధి తదితర అంశాలపై మంత్రి కేటీఆర్ ఈ సదస్సులో ప్రసంగించనున్నారు. హార్వర్డ్ కెన్నడీ స్కూల్, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ప్యానల్ సంయుక్తంగా మంత్రి కేటీఆర్‌ను ఎంపిక చేసింది. హార్వర్డ్ ఆహ్వానంపై మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో పాలనలో పారదర్శకత కోసం ఈ పంచాయితీలను ప్రవేశపెట్టిన సంగత తెలిసిందే. ఈ సదస్సులో ఉద్యోగాల అవకాశాలు, పాలనలో పారదర్శకత కోసం ప్రభుత్వాలు ఏయే చర్యలు తీసుకుంటే మంచిదే చర్చించనున్నారు.

కాగా, కేటీఆర్ తన అమెరికా పర్యటనలో హార్వర్డ్ యూనివర్సిటీలో గల నెట్‌వర్కింగ్ సెషన్స్‌ను సందర్శించనున్నారు. భారతీయ సంస్థలకు చెందిన సీఈఓలను కలవనున్నారు. ఈ సదస్సుకు వ్యాపారవేత్తలు, ప్రభుత్వ పెద్దలు, దాతలు, పారిశ్రామికవేత్తలు హాజరవుతారు.

తోటపల్లిని అందుకే రద్దు చేశాం: మంత్రి హరీశ్ రావు

కరీంనగర్ జిల్లాలోని తోటపల్లి రిజర్వాయర్ రద్దుపై తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు బుధవారం స్పందించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఖర్చు అధికం ప్రయోజనం స్వల్పం కాబట్టే తోటపల్లి రిజర్వాయర్ ను తమ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు.

రిజర్వాయర్ కోసం ప్రభుత్వం సేకరించిన భూములను తిరిగి రైతులకే అప్పగిస్తామని ఈ సందర్భంగా హరీశ్‌రావు స్పష్టం చేశారు. తోటపల్లి చెరువును రూ. 30 కోట్లతో అభివృద్ధి చేస్తామని హారీశ్ రావు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+