రేవంత్‌రెడ్డికి, కేసీఆర్‌కు ఎంత తేడానో చూశారా?

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆలోచనా విధానం చాలా భిన్నంగా ఉంటుంది. చంద్రబాబు దగ్గర శిష్యరికం చేశారు కాబట్టి ఆయన ఆలోచనలను అందిపుచ్చుకోవడంతోపాటు పనితీరు విషయంలో కూడా ఎంతో కష్టపడతారు. ఆ కష్టమే ఆయన్ను ముఖ్యమంత్రిగా చేసింది. ప్రత్యేక రాష్ట్రాన్నిచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి కూడా అవకాశం ఇవ్వని తెలంగాణ రాష్ట్రంలో కాలికి బలపం కట్టుకొని తిరిగి ప్రచారం చేశారు. పార్టీకి జీవం పోసి అధికారంలోకి తెచ్చారు. ముఖ్యమంత్రిగా రెండు సంవత్సరాల సమయాన్ని పూర్తిచేసుకున్నారు. ఏ ఆలోచన చేసినా, ఏ పని తలపెట్టినా దానివల్ల ఎదురయ్యే పరిణామాలను ఊహించి, వాటిని తట్టుకోగలిగేలా ప్రణాళిక రూపొందించుకుంటారు రేవంత్.

జీర్ణించుకోలేకపోయి కేసీఆర్?
అయితే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పనితీరు ఇందుకు విరుద్ధంగా ఉంటుంది. రేవంత్ లా కష్టపడే తత్వం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు. కేసీఆర్ ఆలోచనా విధానం కూడా అంతా నేనే.. సర్వం నేనే అన్నట్లుగా ఉంటుందని, పదేళ్ల కాలంలో ఎమ్మెల్యేలు కలవడానికి వస్తేనే దర్శనం కరవయ్యేదని ఆ పార్టీ శ్రేణులే విమర్శిస్తుంటాయి. తన శత్రువైన రేవంత్ సీఎం అవడం కూడా ఆయన జీర్ణించుకోలేకపోయారంటారు. అప్పటి నుంచి ఫాంహౌస్ కు పరిమితమయ్యారు.

Have you seen the difference between Revanth Reddy and KCR

రాష్ట్రాన్ని పునరుద్ధరిస్తున్న రేవంత్
మెగా సిటీ అయిన హైదరాబాద్ ను మరింత మెగా సిటీగా తీర్చిదిద్దేందుకు నగరం చుట్టుపక్కల ఉన్న 27 మున్సిపాలిటీలను తీసుకువచ్చి హైదరాబాద్ లో విలీనం చేయబోతున్నారు. చిన్న చిన్న మున్సిపాలిటీలన్నీ కలిసి గతంలో హైదరాబాద్ ను మహానగరంగా తీర్చిదిద్దాయి. ఇప్పుడు ఈ 27 కూడా కలుస్తుండటంతో మరింత భారీ నగరం కాబోతోంది. విద్యుత్తు సరఫరా నిలకడగా ఉండేలా చర్యలు తీసుకుంటారు. బ్యాటరీ స్టోరేజ ప్లాంట్లు, పంప్డ్ హైడ్రో స్టోరేజ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. అయితే కేసీఆర్ టైంలో విద్యుత్తు రంగానికి సంబంధించి తీసుకున్న అనేక నిర్ణయాలు ప్రజలకు, రాష్ట్రానికి ఎంతో చేటు చేశాయని విద్యుత్తు రంగ నిపుణులు చెబుతున్నారు.

ఎక్కువ ధర చెల్లించి విద్యుత్తు కొనడం, టెక్నాలజీ లేకపోవడం, సబ్ క్రిటికల్ ప్లాంట్ల వంటివాటితో అనేక నష్టాలు ఎదురయ్యాయి. కానీ రేవంత్ తెస్తున్న నూతన విధానాలు తెలంగాణను పునరుద్ధరించినట్లవుతోందంటున్నారు. ఒకరకంగా మూడువేల మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి చేసేలా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం, ఫ్యూచర్ సిటీ, మెట్రోను ప్రభుత్వ చేతిలోకి తీసుకోవడం, విద్యుత్తు వ్యవస్థల ఆధునికీకరణ తదితరాలతో తెలంగాణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గ నిర్దేశనం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+