వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యార్థులపై HCU భారీ జరిమానా: వారికి సంఘీబావం తెలిపినందుకే..! మండిపడ్డ విద్యార్థి సంఘాలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌లో ఇంకా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే షాహీన్‌బాగ్ నిరసనకారులకు సంఘీభావంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థులు షాహీన్‌బాగ్ నైట్ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఏడాది జనవరిలో ఈ కార్యక్రమం జరిగింది. అయితే కార్యక్రమం నిర్వహించిన ముగ్గురు విద్యార్థులపై యూనివర్శిటీ పాలనావిభాగం రూ.5వేలు జరిమానా విధించిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.

షాహీన్‌బాగ్ నిరసనకారులకు సంఘీబావం

షాహీన్‌బాగ్ నిరసనకారులకు సంఘీబావం

జనవరిలో జరిగిన షాహీన్‌బాగ్ నైట్ కార్యక్రమానికి రాత్రి 9 తర్వాత అనుమతి లేదని పాలనావిభాగం చెబుతోంది. అయినప్పటికీ జరిమానా విధించబడ్డ ముగ్గురు విద్యార్థులు కార్యక్రమంను పొడిగించారని చెబుతోంది. అంతేకాదు యూనివర్శిటీ క్యాంపస్ గోడలపై రంగులతో పెయింటింగ్‌లు వేశారని పాలనా విభాగం పేర్కొంది. యూనివర్శిటీ యంత్రాంగం ఇచ్చిన ఆదేశాలను అతిక్రమించినందుకు ముగ్గురు విద్యార్థులు ఫసీ అహ్మద్, సహానా ప్రదీప్ మరియు అదీష్‌లపై ఒక్కొక్కరికీ రూ.5వేలు జరిమానా విధించినట్లు అడ్మిన్ డిపార్ట్‌మెంట్ చెప్పింది. నోటీసులు ఇచ్చిన 10 రోజుల్లోగా ఈ జరిమానా విధించాలని చెబుతూ మంగళవారం నోటీసులు జారీ చేయడం జరిగింది.

 క్యాంపస్‌లో నిరసనలకు దిగితే క్రమశిక్షణా చర్యలు

క్యాంపస్‌లో నిరసనలకు దిగితే క్రమశిక్షణా చర్యలు


మరోసారి క్యాంపస్‌లో ఇలాంటి చర్యలకు పాల్పడితే క్రమశిక్షణా చర్యలు కఠినంగా ఉంటాయని నోటీసుల్లో పేర్కొంది. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ చదువుపై దృష్టి సారించాలని నోటీసుల్లో యూనివర్శిటీ పాలనావిభాగం సూచించింది. మరోసారి ఇలాంటి చర్యలకు దిగితే దీని పర్యవసనాలు ఏకంగా అకాడెమిక్ కెరీర్‌పై పడుతుందని ఆ విధమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఇక యూనివర్శిటీ పాలనా విభాగం విధించిన జరిమానా నోటీసులను వెంటనే వెనక్కు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

మండిపడ్డ విద్యార్థి సంఘాలు

మండిపడ్డ విద్యార్థి సంఘాలు

యూనివర్శిటీ పాలనావిభాగం మోనార్క్‌లా వ్యవహరిస్తోందని ఇది అప్రజాస్వామికమని విద్యార్థి సంఘాలు ధ్వజమెత్తాయి. బేషరతుగా విధించిన జరిమానా నోటీసులను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల నిరసనలను, సమయాన్ని, వేదికను డిసైడ్ చేస్తూ ఏదో ఒక నోటీసు జారీ చేసినంత మాత్రాన బెదిరేది లేదని విద్యార్థి సంఘాలు చెప్పాయి. అది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఇలాంటి నిబంధనలను ఎవరూ ఫాలో కారని తెగేసి చెప్పాయి విద్యార్థి సంఘాలు.

 ప్రజావ్యతిరేక చట్టాలపై పోరాడుతాం: విద్యార్థులు

ప్రజావ్యతిరేక చట్టాలపై పోరాడుతాం: విద్యార్థులు

దేశంలో ప్రజావ్యతిరేక చట్టాలు, రాజ్యాంగంను తుంగలో తొక్కి ప్రభుత్వాలు చట్టాలు చేస్తున్నాయని విద్యార్థి సంఘాలు ధ్వజమెత్తాయి. అలాంటి వాటిని యూనివర్శిటీ విద్యార్థులు సహించరని స్టూడెంట్స్ యూనియన్ పేర్కొంది. దేశంలోని క్యాంపస్‌లన్నీ ప్రజాస్వామ్యం శ్రేయస్సుకోసమే పోరాడాయనే విషయాన్ని గుర్తు చేశాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇది జరుగుతోందని భవిష్యత్తులో కూడా ఇలాంటి అప్రజాస్వామిక విధానాలపై విద్యార్థులు పోరాడతారని విద్యార్థి సంఘాలు చెప్పాయి.

Recommended Video

Coronavirus Tension In Hyderabad,Telangana Medical Health Department Alert ! | Oneindia Telugu
బెదిరిస్తే బెదరం..మరింత ఉధృతం చేస్తాం

బెదిరిస్తే బెదరం..మరింత ఉధృతం చేస్తాం

ఇక యూనివర్శిటీ పాలనావిభాగం చెబుతున్నట్లుగా కఠిన చర్యలు తీసుకుంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించగా.. అడ్మినిస్ట్రేషన్ విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డాయి. పాలనా యంత్రాంగం నోటీసులు ఇచ్చినంత మాత్రానా విద్యార్థులు బెదిరిపోయి తమ హాస్టల్ గదులకు పరిమితం అవుతారనుకోవడం మూర్ఖత్వమే అవుతుందని చెప్పాయి విద్యార్థి సంఘాలు. అంతేకాదు హక్కుల కోసం పోరాటం చేస్తున్న సమయంలో పాలనాయంత్రాంగం ఇలాంటి బెదిరింపులకు దిగితే రియాక్షన్ మరింత స్ట్రాంగ్‌గా ఉంటుందని హెచ్చరించాయి విద్యార్థి సంఘాలు

English summary
The University of Hyderabad (UoH) imposed a fine of Rs 5,000 each on three students for conducting a ‘Shaheen Bagh Night’ event in the campus in solidarity with the protestors of Shaheen Bagh in Delhi who have been protesting against Citizenship Amendment Act (CAA) and the proposed National Register of Citizens (NRC).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X