కరోనా థర్డ్ వేవ్‌ను సమర్థంగా ఎదుర్కోందాం: మంత్రి హరీశ్ రావు కీలక ఆదేశాలు

హైదరాబాద్: కరోనా వైరస్ థర్డ్ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొందామని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌ రావు సంబంధిత శాఖ అధికారులకు పిలుపునిచ్చారు.
శుక్రవారం అన్ని జిల్లాల వైద్యాధికారులు, ఆశా వర్కర్లతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహంచారు. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ వైద్య సేవలను దేశానికి ఆదర్శంగా నిలుపుదామన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్‌, ఒమిక్రాన్‌ వేరియంట్‌ల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు. రెండో డోసు వంద శాతం పూర్తయ్యేలా పని చేయాలని అధికారులకు సూచించారు. 15-18 ఏళ్ల వారి వ్యాక్సినేషన్ వేగం పెంచాలన్నారు. అన్ని సబ్ సెంటర్లు, పీహెచ్‌సీ కేంద్రాల్లో ఐసోలేషన్‌ కిట్లు, పరీక్ష కిట్లనను సిద్ధం చేయాలన్నారు. లక్షణాలు ఉంటే పరీక్ష చేసి, వెంటనే కిట్లు అందించాలని సూచించారు.

Health minister harish rao review on corona third wave like situation in telangana

బాధితుల ఆరోగ్య పరిస్థితిని రోజువారీ పరిశీలించాలని మంత్రి అధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రజలు వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి అప్పులపాలు కావొద్దని మంత్రి హరీశ్ రావు సూచించారు. ప్రభుత్వాసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉందని తెలిపారు. కొత్త వేరియంట్ వ్యాప్తి ఎక్కువ, ప్రమాదం తక్కువగా ఉందని భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు.

కోవిడ్ పై పోరులో మున్సిపల్, పంచాయతీ శాఖలతోపాటు, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్, కరోనా చికిత్సపై ప్రజలను చైతన్య పరచాలన్నారు. నాన్ కోవిడ్ సేవలకు ఎట్టిపరిస్థితుల్లో అంతరాయం కలగకుండా వైద్యాధికారులు ఎప్పటికప్పుడు సిద్ధం కావాలని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

జనవరి 10 నుంచి 60 ఏళ్లకు పైబడినవారికి బూస్టర్ డోసు ఇచ్చే కార్యక్రమానికి సిద్ధం కావాలన్నారు. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారికి ప్రాధాన్యం ఇచ్చి, రెండు డోసులు పూర్తి చేసి, బూస్టర్ డోస్ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆశా వర్కర్ల పరిధిలో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోని వారు ఒక్కరు కూడా ఉండకూడదనే లక్ష్యంతో పనిచేయాలన్నారు.

Recommended Video

    TRS, BJP మధ్య రసహ్య ఒప్పందం ఇదే .. బట్టబయలు చేసిన V Hanumantha Rao | Oneindia Telugu

    కాగా, తెలంగాణలో కరోనావైరస్ కేసులు, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా బారీగా పెరుగుతున్నాయి. గురువారం ఒక్కరోజే రెండువేలకు చేరువలో కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. ఒమిక్రాన్ కేసులు కూడా తెలంగాణలో 150 వరకు నమోదయ్యాయి. రాష్ట్రంలో 6వేలకుపైగా కరోనావైరస్ యాక్టివ్ కేసులు ఉన్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+